Microsoft Buys Land in Hyderabad: హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం. కాగా ఈ డాక్యు మెంట్ల ప్రకారం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ఒక్కో ఎకరానికి రూ.5.56 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 2022లోనూ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో రూ.275 కోట్లతో మూడు చోట్ల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Also Read: తప్పుడు ప్రకటనలను సహించేదిలేదు.. సెలబ్రిటీలకు సుప్రీం కోర్టు వార్నింగ్!