Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ బాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్!

పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆరోపించారు.

Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ బాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్!
New Update

Telangana : పరిగి కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Ram Mohan Reddy) మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని చెడ్డీ గ్యాంగ్ సభ్యుడంటావా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రామ్మోహన్.. కేసీఆర్ చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే, కేటీఆర్, కవిత, హరీష్ రావు‌లు చెడ్డీ గ్యాంగ్ సభ్యులంటూ ఎద్దేవ చేశారు.

కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్..

పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్. అర్ధరాత్రి దొంగతనాలు చేసి చంద్రశేఖర్ రావు ముఠా తెలంగాణను దోచుకుంది. సీఎం రేవంత్ ను విమర్శించడానికి హరీష్ రావుకు కొంచెమైనా సిగ్గుండాలి. హరీష్ రావు కాదు ఆయన కాళేశ్వరం కమిషన్ రావు. అడ్డదిడ్డంగా కమిషన్లు బొక్కి ఆ డబ్బు మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో హరీష్ రావు బాగోతం కూడా బయటపడబోతుంది. ఆయన కమిషన్ల వ్యవహారాన్ని కూడా కక్కిస్తాం. సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రంగనాయక సాగర్ దగ్గర పేద రైతులను బెదిరించి 13 ఎకరాల ఫాంహౌజ్ కట్టుకోలేదా? అని ఆరోపించారు. చిన్న చిన్న రైతులను భూసేకరణ పేరుతో వేధించి ఫాంహౌజ్ కట్టుకోవడానికి సిగ్గులేదా? నువ్వు, నీ బామ్మర్ది ఫామ్ హౌస్ వ్యవహారాల అన్నింటిని బయటకు తీస్తాం. రైతులపైన ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ బాధపడుతున్నారు. బలవంతంగా భూములు గుంజుకున్నప్పుడు రైతులు హరీష్ రావుకు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Narsampeta : ఉపాధ్యాయుల వేధింపులు.. దారుణానికి పాల్పడ్డ లేడీ టీచర్!

పగటి కలలు కంటున్నావా..

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో నే రుణమాఫీ(Runa Mafi) కాలేదని ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నాడంటూ మండిపడ్డారు. 2018లో రుణమాఫీ హామీ ఇచ్చిన 2023 వరకు చేయనప్పుడు హరీష్ రావు ఆయన మామను ఎందుకు నిలదీయలేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు పగటి కలలు కంటున్నాడని.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. ఒక వేళ ఆ పార్టీ ఉన్నా అందులో హరీష్ రావు ఉండడన్నారు. హరీష్ రావు ఎంత గింజుకున్నా కనీసం మెదక్ ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలవదన్నారు. మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత హరీష్ రావుకు ఆ పార్టీలో కౌంట్ డౌన్ మొదలౌతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

#ram-mohan-reddy #congress #harish-rao #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe