Sensex Today: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ పతనం.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు  

స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజూ నష్టాలతో ప్రారంభం అయింది. నిన్నటి(బుధవారం) భారీ నష్టం తరువాత ఈరోజు (గురువారం-18జనవరి) మార్కెట్ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 482 పాయింట్లు పతనమై 71,018, నిఫ్టీ కూడా 157 పాయింట్లు పతనమై 21,414 స్థాయిలో ప్రారంభమయ్యాయి. 

Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!
New Update

Sensex Today: స్టాక్ మార్కెట్లో బేరిష్ కొనసాగుతోంది. వరుసగా రెండు రోజులు భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు మూడోరోజు అదే ధోరణిలో ప్రారంభం అయ్యాయి. ఈరోజు అంటే జనవరి 18న స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు పతనాన్ని చవిచూస్తోంది. సెన్సెక్స్ 482 పాయింట్లు పతనమై 71,018 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ (Nifty) కూడా 157 పాయింట్లు పతనమైంది. 21,414 స్థాయిలో ప్రారంభమైంది.

ప్రారంభ ట్రేడింగ్ (Trading) సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 24 క్షీణించాయి.  6 పెరుగుతున్నాయి. పవర్, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో మరింత క్షీణత ఉంది. పవర్ గ్రిడ్ షేర్లు 4% కంటే ఎక్కువ క్షీణతతో ట్రేడవుతున్నాయి.

మార్కెట్ పతనానికి 3 కారణాలు:

  • మార్కెట్లలో భారీ ర్యాలీ తర్వాత, ప్రజలు కొంత లాభాలను బుక్ చేసుకుంటున్నారు. మిడ్ - స్మాల్ క్యాప్స్ ఓవర్ వాల్యూడ్ అయ్యాయి.
  • బలహీనమైన ప్రపంచ సంకేతాలు మార్కెట్‌ను దిగజార్చాయి. డౌ జోన్స్ బుధవారం 0.25% పడిపోయింది.
  • ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత, ఇరాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా జియో-టెన్షన్ మళ్లీ పెరగడం ప్రారంభమైంది.

నిన్న మార్కెట్‌లో భారీ పతనం.. 

మొన్న నిన్న అంటే జనవరి 17న స్టాక్ మార్కెట్‌లో (Stock Market) భారీ పతనం కనిపించింది. సెన్సెక్స్ 1628 పాయింట్లు పతనమై 71,500 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 460 పాయింట్లు పతనమైంది. 21,571 వద్ద ముగిసింది.

Also Read: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే.. 

Watch this interesting Video:

#stock-market-today #stcok-market #sensex-today #bse
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe