Suez Canal Crisis: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే.. సూయజ్ కెనాల్ వద్ద హౌతీల దాడుల సంక్షోభంతో భారత్ కు భారీ నష్టం వస్తోంది. నెలకు నాలుగు బిలివైన డాలర్లను భారత్ కోల్పోతోంది. ఈ సంక్షోభంపై సానుకూల చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. By KVD Varma 16 Jan 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Suez Canal Crisis: సూయజ్ కెనాల్ సంక్షోభం కారణంగా, భారతీయ ఎగుమతులు ప్రతి నెలా దాదాపు 4 బిలియన్ డాలర్లను కోల్పోవడం ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు ఇప్పటికే క్షీణించాయి. పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే, సమస్య మరింత తీవ్రమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఎగుమతులను పెంచే చర్యలను ఈ సమావేశంలో పరిశీలిస్తారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ వారంలో మరో సమావేశం జరగనుంది, ఇందులో రక్షణ - విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. ఇందులో, హౌతీల దాడి ప్రభావాన్ని తొలగించడానికి పరిశీలన చేస్తారు. ఈ సవాలు సమయంలో, వ్యాపార శ్రేయస్సును ప్రోత్సహించడానికి సరైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫుట్ కంటైనర్ ఛార్జీ పెరిగింది Suez Canal Crisis: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వస్తువుల ఎగుమతుల్లో 6.51% క్షీణత ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే $ 279 బిలియన్లకు తగ్గింది. హౌతీ దాడుల ప్రభావమే దీనికి ప్రధాన కారణం, దీని కారణంగా విదేశీ వ్యాపార కార్యకలాపాలలో సమస్యలు ఏర్పడుతున్నాయి. హౌతీ ఉగ్రవాదుల దాడి తర్వాత ఎర్రసముద్ర మార్గంలో సరుకు రవాణా ధరలు పెరిగాయని, దీనివల్ల ఖర్చులు పెరిగిపోయాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. గతంలో 40 అడుగుల కంటైనర్ ధర 1400 నుంచి 1800 డాలర్లు ఉండగా, ఇప్పుడు 2600 నుంచి 3000 డాలర్లుగా మారింది. Suez Canal Crisis: దీంతో ఎర్ర సముద్ర మార్గం గుండా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, యూరప్ దేశాలకు వెళ్లే వస్తువులపై ప్రభావం పడిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) డీజీ, సీఈవో డాక్టర్ అజయ్ సహాయ్ తెలిపారు. దీని కారణంగా, ఈ కాలంలో మొత్తం 4 బిలియన్ డాలర్ల నష్టం ఉండవచ్చు. ఇతర మార్గాల్లో సరుకు రవాణా ధరలు కూడా పెరిగాయి. బీమా కంపెనీలు కూడా కవర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ గణాంకాలను విడుదల చేసింది Suez Canal Crisis: ఢిల్లీ వెజిటబుల్ ఆయిల్ ట్రేడర్స్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ నాగ్‌పాల్ మాట్లాడుతూ.. ఓడలు వేరే మార్గంలో వెళ్తున్నందున సరుకులు రావడానికి మరో 15-20 రోజులు పడుతోంది. దీని కారణంగా, రవాణా ఖర్చు టన్నుకు సుమారు $ 15 పెరిగింది. కొత్త డీల్స్‌లో పెరిగిన సరుకు రవాణా, బీమా ఖర్చుల ప్రభావం రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. బీమా కంపెనీలకు సలహా Suez Canal Crisis: బీమా కంపెనీలను కవర్‌ను కొనసాగించాలని, పెరిగిన రిస్క్‌కు అనుగుణంగా ప్రీమియం పెంచాలని ప్రభుత్వం కోరాలని ఆయన అన్నారు. దీర్ఘకాలంలో ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే, భారతదేశం యూరప్, జపాన్, అమెరికా, చైనా లలో ఉన్నట్టు స్వంత పెద్ద షిప్పింగ్ లైన్‌ను అభివృద్ధి చేయాలి, ఇది మనం ప్రతి సంవత్సరం సరుకు రవాణాలో చెల్లించే సుమారు 100 బిలియన్ డాలర్లను ఆదా చేయడంలో సహాయపడుతుంది. Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రయత్నించిన వివేక్ రామస్వామి ఎవరు? WATCH: #houthis #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి