Phone tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టారని విచారణలో తెలిసింది. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయించిందని సమాచారం.2018 నుంచి రేవంత్‌రెడ్డిపై BRS ప్రభుత్వం నిఘా పెట్టిందని నిందితులు విచారణలో తెలిపారు. ఇంటలిజెన్స్ ఆధ్వర్యంలో రేవంత్ కోసం స్పెషల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారుట.
SEBలోని 25 మంది అత్యంత నమ్మకస్థులైన,మెరికల్లాంటి పోలీసు ఆఫీసర్లతో నిఘా బృందాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.బీఆర్ఎస్‌కు చెందిన ఒక నేత ఇంట్నే ఈ మొత్తం నిఘా వ్యవస్థను పెట్టారని చెబుతున్నారు. రేవంత్ ఇంటిపైనా అధికారులు నిఘా పెట్టారని సమాచారం.రేవంత్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎవర్ని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఆర్థికసాయం చేస్తోందెవరు? అన్న విషయాలన్నీ కూపీలు లాగేవారు నిఘా టీమ్.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు రేవంత్‌పై ఈ నిఘా కొనసాగించదని తెలుస్తోంది.
ఇక సీఎం రేవంత్‌తో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులపైనా బీఆర్ఎస్ నిఘా పెట్టిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసుల కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా..త్వరలోనే రాజకీయ నాయకులకూ నోటీసులు పంపిస్తామని చెబుతున్నారు పోలీసులు.మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తులు చేస్తున్నామని తెలిపారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) నిందితుడు రాధాకిషన్‌రావు(Radhakishan Rao) మీద మరిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వెనకు చాలానే నేర చరిత్ర ఉందని తెలుస్తోంది. తాజాగా క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్‌లో ఒకరైన వేణుమాధవ్..రాధాకిషన్‌రావు మీద కంప్లైంట్ చేశారు. తనను కిడ్నాప్ చేసి కోట్లు విలువైన షేర్లు బదిలీ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక్క రాధాకిషన్‌రావు మీదనే కాక మొత్తం టీమ్ మీద ఫిర్యాదు చేశారు. దీంతో రాధాకిషన్‌తోపాటు ఇన్‌స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లికార్జున్ సహా 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.