/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/26-jpg.webp)
Hyderabad Teja's Murder Facts : హైదరాబాద్(Hyderabad) లోని ప్రగతి నగర్‌లో జరిగిన తేజస్ మర్డర్ నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తేజస్ మర్డర్ వెనుక మరో హత్య ఉందని చెబుతున్నారు నిందితులు. తేజస్ హత్య కోసం నిందితులు వారం ముందు నుంచే ప్లాన్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే అతనిని హతమార్చారు. అయితే తేజస్‌ను చంపడానికి కారణం తమ ఫ్రెండ్ తరుణ్ రాయ్(Tarun Roy) అని చెబుతున్నారు. ఎస్‌నగర్‌లో తరుణ్ రాయ్‌ను చంపడానికి తేజస్ ప్లాన్ వేశాడని...అందుకే అతనిని చంపాలనుకున్నామని నిందితులు చెబుతున్నారు.
తేజస్‌తో దోస్తీ..
తేజస్‌ను చంపుతామని సోషల్ మీడియా(Social Media) లో హత్యకు ముందే నిందితులు పోస్టులు పెట్టారు. రెండు నెలల కిందటే జైలు నుంచి వచ్చిన తేజస్.. SRనగర్‌లో ఉంటే ప్రమాదమని ప్రగతినగర్‌కు మకాం మార్చాడు. దీంతో తేజస్ అడ్రస్ కోసం నిందితుల కోవర్ట్ ఆపరేషనక్ చేశారు. నిందితుల్లో ఒకరు తేజస్‌తో ఫ్రెండ్షిప్ పెట్టుకోవడమే కాకుండా అతనితో మంచిగా ఉన్నట్టు కూడా నటించాడు. తేజస్ పక్కనే ఉంటూ అతడి కదలికలను ఎప్పటికప్పుడు మిగతా వారికి చేరవేసేవాడు.
పక్కా ప్లాన్ ప్రకారం..
ఈ క్రమంలో వారం కిందటే నిందితులు హత్య చేయడానికి వచ్చారు. అయితే ఆ రోజు తేజస్ ఇంట్లో లేకపోవడం వలన తప్పించుకోగలిగాడు. దాంతో అప్పటికి ప్లాన్ విరమించుకున్న నిందితులు..తేజస్ హత్యకు ఆదివారం రాత్రి పక్కా ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్‌లో భాగంగానే తేజస్‌తో కలిసి నిందితుల్లో ఒకరు మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటినుంచి మిగతావారు తేజస్ ఇంటి బయట మాటు వేశారు. తేజస్ బాగా తాగాక అతనని బయటకు తీసుకువచ్చిన నిందితులు.. వెంటనే హత్య చేశారు. అయితే అతనిని హత్య చేసిన వారిలో కొందరిని మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు.మిగతావారు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అత్యవసర పిటిషన్