SRIKANTH STUNTER : శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో స్టంట్స్ చేస్తూ లారీ కింద పడి చనిపోయిన శ్రీకాంత్ కు సంబంధించి అనేక కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. కాచీగూడకు చెందిన శ్రీకాంత్ బైకుతో స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అలాగే బాడీపై పచ్చబొట్లు పొడిపించుకుని యువకులను అట్రాక్ట్ చేస్తుంటాడని, అలాగే జేబులో కత్తులు పెట్టుకుని జనాలకు రౌడీ షీటర్ అని చెప్పుకుంటూ పలు దందాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు జనాలు తిరిగే రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంతో ఇప్పటికే పలు రౌడీ షీటర్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్..
ఈ క్రమంలోనే గ్రౌండ్ రిపోర్టు కోసం వెళ్లిన ఆర్టీవి రిపోర్టర్ తన బంధువుల నుంచి అనేక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ ఒక రౌడీ, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. దొంగ, డ్రగ్గిస్ట్, కత్తులు వెంట పెట్టుకుని తిరిగినట్లు వస్తున్న ఆరోపణలపై మీరేమంటారు అని ప్రశ్నించారు. దీంతో మొదట ఆగ్రహానికి లోనైన శ్రీకాంత్ స్నేహితులు.. రీపోర్టర్ పట్ల వల్గర్ కామెంట్స్ చేస్తూ దురుసుగా వ్యవహరించారు. శ్రీకాంత్ లైఫ్ స్టైల్ గురించి ప్రశ్నించగా అవన్నీ తప్పులేనని, ఆయన చాలా మంచి వ్యక్తి అని వాదించారు.
ప్యాంట్ జేబులో కత్తులు..
అయితే ఒకవైపు పోలీసులు డెడ్ బాడీ ప్యాంట్ జేబులో కత్తి దొరికిందని చెప్పినప్పటికీ శ్రీకాంత్ అమాయకుడని ఎలా చెబుతున్నారని ప్రశ్నించగా.. అతను రౌడీ షీటర్ కాదని, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడని చెప్పారు. టాటూస్ వేస్తాడని, ఫ్యామిలీ కూడా ఏదో ఒక పని చేసుకుంటారని చెబుతున్నారు. న్యూస్ ఛానల్స్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని వాపోయారు. ఇక శ్రీకాంత్ పై నమోదైన కేసులపై ప్రశ్నిస్తే.. ఎవరూ సరిగ్గా స్పందించకపోగా ప్రశ్నలు అడుతుతున్న రిపోర్టను బెదిరించే ప్రయత్నం చేశారు. సెఫ్టీ కోసం కత్తులు పెట్టుకుని తిరుగున్నారా? కత్తులు పెట్టుకుని తిరిగే వాళ్లు సామాన్యులు ఎలా అంటారని అడిగితే.. ఎవరైనా దమ్మీ ఇస్తారని కత్తి పెట్టుకుని తిరుగుతాడని, సోషల్ మీడియాలో అతని ఎదుగుదలను ఓర్వలేక ఎవరైనా దాడి చేస్తారని సేఫ్టీ కోసం దగ్గర ఉంచుకున్నాడని చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీసులు వివరాలు వెల్లడిస్తే తప్పా.. అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Upasana: ఒకే కుటుంబంలో ఇద్దరికీ పద్మవిభూషణ్.. మెగా కోడలు పోస్ట్ వైరల్
ఎవరితో గొడవలు పెట్టుకోలేదు..
ఇక శ్రీకాంత్ సోదరుడు మాట్లాడుతూ.. శ్రీకాంత్ పై ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఆయన ఎప్పుడూ గొడవలు పెట్టుకోలేదని, సోషల్ మీడియాలో స్టైల్ చూసి రౌడీ షీటర్ అని ముద్ర వేశారన్నారన్నారు. ఇన్ స్టా వీడియోల్లో అతని సినిమా డైలాగులు, స్టంట్స్, ఫ్యాషన్ ను ఆధారంగా రౌడీ షీటర్ అని ముద్ర వేయడం సరికాదన్నారు. అలాగే శ్రీకాంత్ సోదరి మాట్లాడుతూ.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. ఇప్పటికీ అతని మరణంతో తీవ్ర దుఖంలో ఉన్నామని, ఇలాంటి సయమంలో అడ్డగోలుగా విష ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.
ఇక గురువారం అర్ధరాత్రి చాదర్‌ఘాట్ పీఎస్ సమీపంలోని సవేరా హోటల్ దగ్గర బైక్ మీద స్టంట్స్ చేస్తున్న శ్రీకాంత్‌ని లారీ వచ్చి గుద్దేసింది. దీంతో లారీ చక్రాల కింద పడి శ్రీకాంత్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.