D.Srinivas: మాజీ ఎంపీ డీఎస్‌ కు తీవ్ర అస్వస్థత!

నిజామాబాద్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్‌ తో హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు.

D.Srinivas: మాజీ ఎంపీ డీఎస్‌ కు తీవ్ర అస్వస్థత!
New Update

Ex Mp: నిజామాబాద్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్‌ తో హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం డీఎస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తండ్రి అనారోగ్యం విషయాన్ని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మా నాన్న శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సోడియం లోపం కారణంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఐసీయూలో చేరారని ట్విటర్ వేదికగా వివరించారు. మా నాన్న ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రార్థించాలని అన్నారు. ప్రస్తుతం డీఎస్‌ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డీఎస్‌... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు.

ఆ తరువాత ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా లేరనే చెప్పాలి. ఇందుకు అనారోగ్య సమస్యలే కారణంగా తెలుస్తోంది.

Also read: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. నేడు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

#nizamabad #hospital #trs #ex-mp #icu #d-srinivs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe