Haryana: మరో ఘోరం.. వైద్య విద్యార్థినిపై సీనియర్ వైద్యుడి దాడి! హర్యానాలోని రోహ్‌తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. By Bhavana 21 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Haryana: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనతో యావత్ భారత దేశం అట్టుడుకుతున్న క్రమంలో మరో ఘోరం బయటకు వచ్చింది. ఈసారి ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రోహ్‌తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఆదివారం పీజీఐఎమ్‌ఎస్ డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌తో నిందితుడు కౌశిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు సోషల్ మీడియా ద్వారా తన బాధను తెలియజేసింది. శరీరమంతా గాయాలు చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కౌశిక్ తనను ప్రేమించాలని, శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని తెలిపింది. रोहतक, हरियाणा PGI का सीनियर डॉक्टर मनिंदर गिरफ्तार हुआ है। आरोप है कि वो मेडिकल छात्रा को कार में किडनैप करके अंबाला–चंडीगढ़ ले गया। उस पर जबरन शादी का दबाव बनाया। उसकी पिटाई की। आरोपी डॉक्टर मनिंदर को गिरफ्तार करने के बाद PGI से सस्पेंड कर दिया गया है। pic.twitter.com/YTFPIWYOtw — Sachin Gupta (@SachinGuptaUP) August 19, 2024 వ్యతిరేకించినందుకు తన మీద దాడి చేశాడని విద్యార్థిని వివరించింది. శారీరకంగా, మానసికంగా చాలా హింస పెట్టాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేయించడమే కాకుండా.. క్యాంపస్ నుంచి బహిష్కరించింది. Also Read: కావాలని రెండుసార్లు ఢీకొట్టి.. కారుతో భీభత్సం #student #haryana #kidnap #bds #rohtak #senior-doctor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి