Maharashtra: కావాలని రెండుసార్లు ఢీకొట్టి.. కారుతో భీభత్సం

మహారాష్ట్రలోని ధానేలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. కావాలని పదే పదే తన కారుతో ఢీకొట్టడమే కాకుండా..అందులో ఉన్నవారు తీవ్రంగా గాయడేలా చేశాడు మరొక కారు ఓనర్. ఈ ఘటన వివరాలు పూర్తిగా తెలియన్పటికీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.

New Update
Maharashtra: కావాలని రెండుసార్లు ఢీకొట్టి.. కారుతో భీభత్సం

Thane: రోడ్డుకు ఒకవైపు ఆగి ఉన్న టయోటా ఫార్చునర్‌ వెనుక నుంచి వస్తున్న మరొక కారు టాటా హారియర్ గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. తనతో పాటూ ఒక మనిషిని కూడా తీసుకెళ్ళింది. అక్కడితో ఆగకుండా యూ టర్న్ తీసుకుని వెనక్కు వచ్చి మరీ ఫార్చునర్‌‌ను మళ్ళీ ఢీకొట్టింది. టాటా హారియర్ కారు చేసిన ఈ భీభత్సం అక్కడ వారందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. హారియర్ కేవలం మరోక కారునే కాకుండా రోడ్డు మీద నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులను, ఒక బైక్‌ రైడర్‌‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఘటన లో ఓ పిల్లాడితో పాటూ పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్రలోని థానేలో జరిగిందీ ఘటన. కారు ఢీకొట్టిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాంతో పాటూ రోడ్డు మీద ఉన్నవారు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇంత భీభత్సం చేసిన హారియర్ కారులో ఎవరున్నారన్నది మాత్రం తెలియలేదు. గుద్దిన తర్వాత కూడా డ్రైవర్ కారు నుంచి బయటకు రాలేదు. అక్కడే రోడ్డు మీద నిలబడి ఉన్న పలువురు డ్రైవర్‌‌ను బయటకు లాగడానికి ప్రయత్నించారు. ఇప్పటివరకు నిందితుడి వివరాలు మారం తెలియలేదు. మరోవైపు వీడియో ఆధారంగా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: MollyWood: మాలీవుడ్‌లో మహిళలకు నరకమే..హేమ కమిటీ రిపోర్ట్‌లో ఆశ్చర్యకర అంశాలు 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు