Senior Actress Shobana First Look From Kalki 2898 : తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన శోభన.. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ప్రభాస్ (Prabhas) లాంటి పాన్ ఇండియా హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898AD' మూవీలోసీనియర్ నటి శోభన ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
తాజాగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ కింద ఆమె పూర్వీకులు కూడా ఆమె లాగే వేచి ఉన్నారు అంటూ రాసుకోచ్చింది. ఇక ఈ మూవీలో 'మరియం' అనే పాత్రలో శోభన నటించబోతుంది. పోస్టర్ ను బట్టి చూస్తే శోభనకు ఇందులో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై (Vyjayanthi Films) అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.