Sekhar Kammula Movie: శేఖర్ కమ్ముల మల్టీ స్టారర్.. ధనుష్ తో పాటు మరో అగ్ర హీరో

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ మూవీ పట్టాలెక్కనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్టార్ హీరోస్ నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా పూజ కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించినట్లు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా తెలిపింది.

New Update
Sekhar Kammula Movie: శేఖర్ కమ్ముల మల్టీ స్టారర్.. ధనుష్ తో పాటు మరో అగ్ర హీరో

Sekhar Kammula with Dhanush & Nagarjuna: సహజంగా ఒక్క అభిమాన నటుడు తెర పై కనిపిస్తేనే ఫ్యాన్స్ రచ్చ చేస్తారు. ఇక మల్టీ స్టారర్ సినిమాలు అంటే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాలను అందుకున్నాయి. రీసెంట్ వచ్చిన మల్టీ స్టారర్ RRR ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో ఊపిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల ఇలా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి.

మల్టీ స్టారర్ సినిమా

ఇక ఇప్పుడు ఇదే దారిలో మరో మల్టీ స్టారర్ సినిమా పట్టాలెక్కింది. తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. డైరెక్టర్ శేఖర్ కముల దర్శకత్వంలో స్టార్ హీరోస్ ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతోంది. గురువారం పూజ కార్యక్రమాలతో ఘనంగా సినిమాను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ బ్యానర్ పై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు.

Sekhar Kammula with Dhanush & Nagarjuna

Also Read: Oscar Awards: 2024 ఆస్కార్ నామినేషన్స్ లో మరో తెలుగు సినిమా.. ఏంటో తెలుసా..?

ఈ విషయాన్నీ చిత్ర బృదం సోషల్ మీడియా వేదిక అనౌన్స్ చేసింది. "బ్లాక్ బస్టర్ ప్రయాణం మొదలైంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది. #DNS పేరుతో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఇటీవలే నా సామిరంగ తో నాగార్జున, కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ సూపర్ హిట్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పై సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది.

Sekhar Kammula with Dhanush & Nagarjuna

Also Read: Pushpa 2 OTT Release: ఆ OTT సంస్థతో ఒప్పందం ఫిక్స్.. pushpa-2 నుంచి అదిరే అప్డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు