Lasya Nanditha : సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) రోడ్డు ప్రమాదం(Road Accident) లో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న XL6 కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాకపోవడంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
ఆమెతో పాటు కారులో ఉన్న డైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) లాస్య సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరి లో లాస్య నందిత తండ్రి , ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna) మృతి చెందారు. సరిగా ఏడాది తరువాత లాస్య కూడా మృతి చెందడంతో పార్టీ వర్గాలు దుఃఖంలో మునిగిపోయాయి.
కొద్ది రోజుల క్రితం లాస్య నల్గొండ సభకు వెళ్లినప్పుడూ కూడా ఆమె కారు కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అప్పుడు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు పట్టణంలోని అమేద ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.సాయన్న కుటుంబానికి కలిసి రాని ఫిబ్రవరి నెల. గతేడాది ఫిబ్రవరి 19 న సాయన్న మృతి చెందగా..ఈ ఏడాది ఫిబ్రవరి 23న నందిత మృతి చెందారు.
Also Read : వేసవి రాకముందే మీ ఆహారంలో ఈ 2 మార్పులు చేయండి.. సమస్యల నుంచి కాపాడుతుంది!