Elections: రెండోదశ పోలింగ్..13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఓటింగ్

2024 ఎన్నికల్లో భాగంగా రేపు రెండోదశ పోలింగ్ జరిగింది. ఇందులో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ దశ పోలింగ్‌లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పాటూ కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

New Update
Elections: రెండోదశ పోలింగ్..13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఓటింగ్

2024 Elections poling: దేశంలో ఎన్నికల హడావుడి మొదలై చాలా రోజులు అయింది. మొదటి దశ పోలింగ్ అయిపోయింది. మరికొన్ని చోట్ల నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో రేపు రెండెదశ పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా 12 రాష్ట్రాలకు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ప్రదేశాల్లో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. రేపటి కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మొత్తం 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మామూలుగా అయితే 89 స్థానాలకు జరగాలి కానీ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ స్థానంలో బిఎస్‌పి అభ్యర్థి మరణించిన తరువాత, ఇప్పుడు ఈ స్థానంలో మే 7 న ఎన్నికలు నిర్వహించనున్నారు.

రెండో దశ ఎన్నికల్లో 1,198 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1,097 మంది పురుషులు, 100 మంది మహిళా అభ్యర్థులు ఉండగా.. ఒక అభ్యర్థి థర్డ్ జెండర్. రెండో విడతకు సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రమే ముగిసింది.ఇక శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో వడగాల్పులు, ఎండ కారణంగా పోలింగ్ సమయం పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకోనుంది. దీంతో అక్కడ సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

12 రాష్ట్రాల సీట్లు..

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు, కర్ణాటకలోని 14, రాజస్థాన్‌‌లోని 13, మహారాష్ట్రలోని 8, ఉత్తర్​ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, అసోం, బిహార్‌లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌‌లోని చెరో స్థానంలో రెండో దశ పోలింగ్‌ జరగనుంది.

రాహుల్ గాంధీ..

రెండోదశ పోలింగ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ కూడా ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీకి వయనాడ్‌లో దాదాపు 7 లక్షల ఓట్లు పోలయ్యాయి.మరో స్థానం అమేధీ నుంచి పోటీ చేసినా అక్కడ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం రాహుల్ కేవలం వయనాడ్ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడ నుంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు రాహుల్. క్కడ రాహుల్ గాంధీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ తలపడుతున్నారు. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా కూడా పోటీలో ఉన్నారు.

ఇతర స్థానల్లో ఉన్న ముఖ్య అభ్యర్థులు..

ప్రముఖ నటి, బీజేపీ నేత హేమ మాలిని ఉత్తర్​ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మథుర నుంచి ఆమె గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో హేమమాలిని ఉన్నారు. రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించి యావత్ దేశం మన్ననలు అందుకున్న ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ మీరఠ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఇతర స్థానాల్లో ఉన్న కీలక నేతల్లో ఇతర కీలక నేతల జాబితాలో కాంగ్రెస్‌ నేత శశి థరూర్ (తిరువనంతపురం), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (రాజ్‌నంద్‌గావ్), డీకే సురేష్ (బెంగళూరు గ్రామీణం), కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పుర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోటా), వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ (అకోలా), బీజేపీ బంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (బాలూర్‌ఘాట్), అనిల్ ఆంటోనీ (పతనంతిట్ట), తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణం), హెచ్‌డీ కుమార్ స్వామి(మాండ్యా), వైభవ్ గెహ్లత్(జలోర్), శోభ కరంద్లాజే (బెంగళూరు ఉత్తరం) తదితరులు ఉన్నారు.

ఏప్రిల్ 19 నుంచి 2024 ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం ఏడు దశల్లో ఇవి జరగనున్నాయి. చివరి ఏడోదశ జూన్ ౧న జరగనుంది. జూన్ 4న మొత్తం అన్ని దశల ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు.

Also Read:Supreme Court: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు