/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-11T185349.438-jpg.webp)
Guntur Karam - Oh My Baby Song: మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ పనులు గ్యాప్ లేకుండా బిజీగా సాగుతున్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇటీవలే గుంటూరు కారం నుంచి విడుదలైన "ధమ్ మసాలా" సాంగ్ సోషల్ మీడియాల్ మంచి బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Nagarjuna: “ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల”.. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Screenshot-2023-12-11-185530.png)
తాజాగా చిత్రం బృందం మరో సాంగ్ "Oh My Baby" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ పాటలో శ్రీలీల, మహేష్ బాబు విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. "Oh My Baby" పాటకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ (Thaman) సంగీతం అందించారు. సింగర్ శిల్పా రావ్ మధురమైన వాయిస్ పాట అద్భుతంగా వినిపించేలా చేసింది. సరస్వతి పుత్ర, రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు చక్కటి లిరిక్స్ అందించారు.
#OhMyBaby Promo is Here ✨🫶
So Enjoyed Programming this Super Fun track 🎧#GunturKaaramSecondSinglehttps://t.co/Ri7TZkrMJ6
— thaman S (@MusicThaman) December 11, 2023
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-11T184218.477-jpg.webp)
Also Read: Bigg Boss 7 Telugu: “మీరు ఎప్పటికీ వెలిగే జ్యోతి”.. బిగ్ బాస్ మాటలకు ఎమోషనల్ అయిన అమర్..!
Follow Us