Adani: ఆదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ వాటాలు-హిండెన్‌బర్గ్ రిపోర్ట్

హిండెన బర్గ్ మరో బాంబ్ పేల్చింది. అదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ మాదభిపూరి బుచ్, ఆమె భర్తకు వాటాలున్నాయని చెప్పింది. అందుకే అదానీ మీద చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

Adani: ఆదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ వాటాలు-హిండెన్‌బర్గ్ రిపోర్ట్
New Update

Hindenburg Report: హిండెన్ బర్గ్ రిపోర్ట్ మళ్ళీ అదానీకి (Adani) చెందిన కంపెనీలపై ఆరోపణలు చేసింది. 18 నెలలు క్రితం తాము రిపోర్ట్ విడుదల చేశాక కూడా అదానీపై సెబీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని...దానికి కారణం సెబీ ఛైర్మన్‌కు (SEBI Chairperson) వాళ్ళ కంపెనీలో వాటాలు ఉండడమే అని చెప్పింది. సెబీ ఛైర్మన్ మాదభిపురి బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు అదానీకి చెందిన మారిషస్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని తెలిపింది. దీంతో ఇప్పుడు మళ్ళీ భారతదేశంలో సంచలనం రేగింది. క్రితం సారి హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో భారత్‌ టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదానీ కంపెనీ షేర్లు అన్నీ పడిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త రిపోర్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ (Stock Market) మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం మార్కెట్ పడిపోయే సూచనలు కనిపిస్తునన్నాయని నిపుణులు అంటున్నారు.

అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది. దానిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. తాము ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్ట్‌లో ఎటువంటి తప్పులేదని హిండెన్ బర్గ్ చెబుతోంది. తాము అప్పుడు కూడా వాస్తవాలనే వెల్లడించామని చెప్పింది. అయితే వాటిని భారత సుప్రీంకోర్టు కొట్టేసింది. అదానీ గ్రూప్ మీ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు చిన్నవిగా అభివర్ణించారు. అదానీ గ్రూప్ మీద సెబీ నిర్వహించిన దర్యాప్తుల్లో ఏమీ తేలలేదని చెప్పింది. అయితే దానికి వేరే కారణం ఉందని అంటోంది హిండెన్ బర్గ్. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ మేరకు విజిల్‌ బ్లోయర్‌ నుంచి తమకు సమాచారం అందిందని తెలిపింది.

గౌతమ్‌ అదానీ బ్రదర్ వినోద్‌ అదానీ (Vinod Adani) నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లున్నాయి. వాటిల్లో మాధవి పురి, ఆమె భర్త ధావల్‌ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ చెబుతోంది. గతేడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటపెట్టింది. అప్పుడు సెబీ దీని మీద దర్యాప్తు చేసింది. ఇప్పుడు అదే సంస్థ సెబీని టార్గెట్‌ చేసింది. అయితే సెబీ ఇప్పటివరకు దీనిమీద స్పందించలేదు.

#hindenburg #adani #chairperson #sebi #hindenburg-research
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe