YS Viveka Case : వివేకా హత్యకేసులో ప్రధాన సాక్షి సీఎం జగన్ ఓఎస్డీ, వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి
ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రధాన సాక్షిగా పేర్కొంది. ఈ మేరకు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని, కోర్టుకు సబ్మిట్ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి నుంచి తీసుకున్న వాంగ్మూలంలో కొన్ని కీలక విషయాలను పేర్కొన్నారు. జగన్ ఫోన్ వాడరు... పీఏ ఫోన్ లేదా నా ఫోన్ లోనే మాట్లాడతారు" అంటూ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వివరించారు.