కేసీఆర్పై విరుచుకుపడిన ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పంట పొలాలు దెబ్బతిన్నా సీఎం మాత్రం ఇంతవరకు రైతుల పరిహారం గురించి మాట్లాడకపోవటం బాధాకరం అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి రైతులకు పరిహారం ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.