Fake PhonePe: ఫేక్‌ ఫోన్‌ పే యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లు..

ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి మొబైల్‌ షాపులో ఫోన్‌ కొని నగదును ఫోన్ పే యాప్ ద్వారా చెల్లించాడు. డబ్బులు చెల్లించినట్లు అతడి ఫోన్‌లో కనపించింది. కానీ ఓనర్‌ ఖాతాలోకి రాలేవు. అనుమానం వచ్చిన ఓనర్‌ ఆ వ్యక్తి నకిలీ ఫోన్‌ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు ఓనర్ గుర్తించాడు.  

Fake PhonePe: ఫేక్‌ ఫోన్‌ పే యాప్‌తో మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లు..
New Update

Fake PhonePe App Scam: ఫోన్‌ పే ద్వారా నగదు తీసుకుంటున్నారా..ఐతే బీ కేర్‌ఫుల్‌. మీ ఫోన్‌కు నగదు వచ్చినట్లు అవతలి వ్యక్తి ఫోన్‌లో చూపిస్తుంది. కానీ అది మీ ఖాతాలో జమ అవదు. అదేంటి అనకుంటున్నారా. అది ఫోన్ పే యాపే కానీ ఉత్తుత్తి ఫోన్‌ పే. ఈ నకిలీ ఫోన్‌ పే యాప్‌ను అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులను, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..జంగారెడ్డి గూడెంలోని పద్మజ మొబైల్‌ షాపులోకి ఓ వ్యక్తి వచ్చి సెకండ్‌ హ్యాండ్‌లో ఓ ఫోన్‌ కొన్నాడు. తర్వాత ఆ ఫోన్‌కు సంబంధించిన నగదును ఫోన్ పే యాప్ ద్వారా చెల్లించాడు. కానీ షాప్‌ ఓనర్‌కు నగదు వచ్చినట్లుగా ఎలాంటి మెసేజ్ రాలేదు.

Also Read: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్‌ ఎదుట మహిళ ఆవేదన!

దీంతో అనుమానం వచ్చిన షాప్ ఓనర్ వెంటనే సదరు వ్యక్తిని నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఫోన్‌ కొనడానికి వచ్చిన వ్యక్తి నకిలీ ఫోన్‌ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని వీడియో తీశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంకులు, సూపర్‌ మార్కెట్లు, కిరాణా షాపుల్లో కొంత మంది కేటుగాళ్లు ఇలాంటి యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు పోలీసులు. సో...ఇలాంటి కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Disclaimer- PhonePe, India's leading UPI payment platform urges its users to be cautious of fake PhonePe apps circulating in the market. Users are requested to download the PhonePe App only from official sources, and check for total downloads, reviews and developer's information to identify the right app. If you’re a merchant/business, trust only verified channels for payment confirmations. For PhonePe users, rely solely on your PhonePe SmartSpeakers or the PhonePe for Business app for transaction notifications.

#andhra-pradesh #telugu-news #scam #phonepe
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe