Wheat : అద్భుతం.. ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే గోధుమను అభివృద్ధి చేసిన పరిశోధకులు..

ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని జర్మనీకి చెందిన పరిశోధకులు తయారు చేశారు. ఒక ఎకరానికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతులు.. ఈ ప్రత్యేక గోధుమ వంగడం వల్ల ఏడాదిలో ఒక్క ఎకరానికే 100 క్వింటాళ్లకు పైగా గోధుమ పండించవచ్చని పరిశోధకులు తెలిపారు.

Wheat : అద్భుతం.. ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే గోధుమను అభివృద్ధి చేసిన పరిశోధకులు..
New Update

World Food Program : ప్రపంచంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతోంది. అలాగే వాతావరణ మార్పులతో ప్రతిఏటా వరదలు, కరువులు సంభవిస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొంది. వరల్డ్‌ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) అంచనాల ప్రకారం చూసుకుంటే.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఎల్‌నిలో ప్రభావం వల్ల ఈ ఏడాది 49 దేశాల్లో కరువు రావొచ్చని డబ్ల్యూఎఫ్‌పీ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలుకావడంతో ప్రపంచ దేశాల్లో ఆహర సంక్షోభం పెరిగింది. ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జర్మనీ పరిశోధకులు ఓ శుభవార్త తెలిపారు.

Also Read: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్!

ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసినట్లు మ్యూనిచ్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ కొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని పేర్కొన్నారు. అలాగే నీటి వాడకం కూడా 95 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి జర్మనీకి చెందిన డ్యుయిష్ వెల్లే అనే సైన్స్ వెబ్‌సైట్‌ ఓ పరిశోధన పత్రాన్ని ప్రచూరించింది. ఒక ఎకరంలో ఏడాదికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతులు.. ఈ వంగడం వల్ల ఏడాదిలో ఒక్క ఎకరాల్లోనే 100 క్వింటాళ్లకు పైగా పంటలను పండించవచ్చని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ వంగడం వల్ల ఆహార సంక్షోభాన్ని కూడా తరిమేయవచ్చని పేర్కొన్నారు.

తక్కువ వ్యవధిలోనే ఎక్కువగా దిగుబడినిచ్చే ఈ గోధుమ వంగడాన్ని జర్మనీ పరిశోధకులు అభివృద్ధి చేయగా.. మరోవైపు పంజాబ్‌ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే మరో అరుదైన గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఈ గోధుమ వల్ల కేవలం ఇమ్మునిటీ పవర్ పెరగడమే కాదు.. టైప్ -2 డయాబెటిస్, ఉబకాయం, గుండె జబ్బుల వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు వీలుంటుందని పరిశోధకులు వివరించారు.

Also Read: ఈ రోజు తెలంగాణ ప్రజలకు పండగ రోజు

#telugu-news #germany #wheat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe