Supreme Court: వారికి పరిహారం రూ.30 లక్షలు చెల్లించాల్సిందే.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతి చెందింతే వారి కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాన్యువల్‌ స్కావెంజర్‌గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన బాధితులకు రూ.20లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచనలు చేసింది. అలాగే ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని పేర్కొంది. ఈ వృత్తిలో కొనసాగేవారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Supreme Court: వారికి పరిహారం రూ.30 లక్షలు చెల్లించాల్సిందే.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
New Update

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చేతులతో మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం భారీగా పరిహాం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ అనేక మంది చనిపోతున్నారని.. అలాగే కొంతమంది వైకల్యానికి కూడా గుర్యయారంటూ ఇటీవల సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ పిల్‌ను జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ అర్వింద్‌ కుమార్‌ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్ స్కావెంజింగ్‌ను సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవవాలని ధర్మాసం సూచించింది. చేతులతో మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. మాన్యువల్‌ స్కావెంజర్‌గా పని చేస్తూ శాశ్వత వైకల్యానికి గురైన బాధితులకు రూ.20లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచనలు చేసింది.

అలాగే ఇతర రకాల వైకల్యానికి గురైన వారికి రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని పేర్కొంది. అలాగే ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలని సుప్రీం తెలిపంది. గత ఐదేళ్లలో చూసుకుంటే.. మురుగు కాలువలను శుభ్రం చేస్తూ దాదాపు 350 మంది పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారని చెప్పింది. 2022లో లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించిన డేటా ప్రకారం.. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో దాదాపు 40 శాతం మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు.2013, 2018లో చేసిన సర్వేల ప్రకారం దేశంలో 58,098 మంది మురుగు కాలువలను శుభ్రం చేసే వృత్తి చేస్తున్నారని.. ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. మాన్యువల్‌ స్కావెంజింగ్‌పై నిషేధం ఉంది. అయితే ఆ వృత్తిలో కొనసాగేవారికి పునరావాసం కల్పించాలని చట్టం కూడా చేశారు. అయితే కుల ఆధారిత వృత్తిపై 1993లోనే నిషేధం విధించారని.. అయినా కూడా అది ఇప్పటికీ కొనసాగుతోందని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు.

#manual-scavenging #telugu-news #national-news #supreme-court
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe