Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు పతంజలి సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మళ్లీ ప్రకటనలు చేయడంతో సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. By B Aravind 16 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Supreme Court : పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ ఫౌండర్ రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ(Acharya Balakrishna)పై సుప్రీంకోర్టు మళ్లీ చురకలంటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆదేశించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాందేవ్ బాబా, బాలకృష్ణ హాజయ్యారు. ఈ సందర్భంగా వీళ్లు మరోసారి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తాము తప్పు చేశాని.. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. Also Read: జనసేనకు ఊరట..గాజుగ్లాసు గుర్తు వారికే.. అయితే వీళ్లిచ్చిన వివరణపై జస్టీస్ హిమా కోహ్లీ, జస్టీస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 'గత ఉత్తర్వుల్లో మేము ఏం చెప్పామో మీరు వాటిని తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. నయం చేయలేని వ్యాధులపై ప్రకటను ఇవ్వకూడదనే విషయం మీరు తెలియదా. ఇది బాధ్యతారాహిత్యం. మీరు చేసేది మంచి పని అయినా కూడా.. అల్లోపతిని తగ్గించి చూపించకూడదు. మీ క్షమాపణలను పరిశీలిస్తాం. కానీ ఇప్పుడే మిమ్మల్ని వదిలేయడం లేదు. మరో వారం లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత తదుపరి కేసును ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. పతంజలి ఆయుర్వేద సంస్థ.. ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు గత ఏడాది నవంబర్‌లో ఈ సంస్థను మందలించింది. అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని సూచనలు చేసింది. దీన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను వీళ్లు ఉల్లంఘించడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. దీనిపై మళ్లీ ఇప్పుడు విచారణ జరిపింది. Also read: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో ఫ్లైట్.. 2 నిమిషాల ఫ్యూయల్ ఉందనగా ల్యాండింగ్ #telugu-news #supreme-court #patanjali #patanjali-case #patanjali-advertisements మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి