Hiring : ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఇతర శాఖల కోసం..
ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. (SBI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ఇతర శాఖల కోసం దాదాపు 12,000 మంది ఉద్యోగులను(Employees) నియమించుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు చైర్మన్ దినేష్ ఖరా మే 9న చెప్పారు. ఈ మేరకు 'సుమారు 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులు నియామకాలు ప్రక్రియలో ఉన్నాయన్నారు. వీరు సాధారణ ఉద్యోగులు, కానీ మా అసోసియేట్ స్థాయిలో, అధికారుల స్థాయిలో దాదాపు 85 శాతం మంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను తాము కలిగి ఉన్నట్లు చెప్పారు. మేము వారికి బ్యాంకింగ్‌ను అర్థం చేసుకోవడానికి కొంత శిక్షణ చేస్తాం. ఆ తర్వాత మేము వారిని వివిధ అసోసియేట్ పాత్రలలోకి మార్చడం ప్రారంభిస్తాం. కొంతమందిని ITలో అని ఖారా తెలిపారు.
ఇది కూడా చదవండి: Vote value: ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి.. గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రచారం!
మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,296, FY23లో 2,35,858 నుండి పడిపోయింది. సాంకేతిక నైపుణ్యాల(Technical Skills) కోసం కొత్త ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రత్యేకంగా తీసుకోవాలని కూడా ఖరా చెప్పారు. ఆలస్యంగా, మేము సాంకేతిక నైపుణ్యాల కోసం నియామకం ప్రారంభించామని ఖరా అన్నారు.