నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో SBIలో 8773 జాబ్స్.. నేటినుంచే దరఖాస్తులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులను భర్తీ చేయనుండగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలున్నట్లు వెల్లడించింది.

SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. UPI, YONO సేవలు బంద్!
New Update
SBI Clerk Recruitment 2023: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఎస్ బీఐలో (SBI) ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 17 నుంచి డిసెంబర్‌ 7వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు మొత్తంగా 8,773 (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కలిపి) జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ & సేల్స్‌) ఉద్యోగాలను భర్తీ చేయనుండగా వీటిలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలున్నట్లు తెలిపింది. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌తో పాటు స్థానిక భాష పరీక్ష ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్‌ ఇయర్ లాస్ట్ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.

అభ్యర్ధుల వయసు:

ఏప్రిల్‌ 01,2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1995 నుంచి ఏప్రిల్ 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. SC,STలకు 5సంవత్సరాలు, OBCలకు 3ఏళ్లు, PDWD అభ్యర్థులకు 10 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Also read :Indian Army : భారత సైన్యంలోకి ట్రాన్స్ జెండర్లు…?

ఇక ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam) జనవరిలో, మెయిన్‌ పరీక్ష (Mains) ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్ష ఇంగ్లీష్‌, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ రాసుకునే వెలుసుబాటు కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో రాయొచ్చు.

మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలకు 35, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక గంట సమయం. నెగిటివ్‌ మార్కులున్నాయి. ప్రతి తప్పుకు 1/4 మార్కులను తొలగిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే ప్రధాన పరీక్షకు ఎంపిక అనుమతిస్తారు. మెయిన్‌ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, దివ్యాంగ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు మాత్రం రూ.750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేయడం, ఫీజు చెల్లింపు తదితర సమస్యలకు 022 22820427 నంబర్‌ను సంప్రదించవచ్చు. బ్యాంకు పనివేళల్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కాంటాక్టు చేయొచ్చు. ఏవైనా సందేహాలుంటే http://cgrs.ibps.in లోనూ కంప్లైంట్ చేయాలని అధికారులు తెలిపారు.

SBI Clerk Recruitment 2023 Notification PDF:

పరీక్ష కేంద్రాలు:

తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌.

ఆంధ్రప్రదేశ్:  అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మత సంబంధిత మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందుకోసం  దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు. 6 నెలల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.

Apply Online

#latest-jobs-in-telugu #sbi-clerk-recruitment-2023 #sbi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe