Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడండి.. అమెరికాలో భారతీయుల నిరసన!

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడానికి ఐక్యరాజ్యసమితి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ అమెరికాలో భారతీయ హిందువులు నిరసన వ్యక్తం చేశారు. దక్షిణాసియాలో శాంతిభద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు. హ్యూస్టన్‌ షుగర్‌ ల్యాండ్‌ సిటీ హాల్‌లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

New Update
Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడండి.. అమెరికాలో భారతీయుల నిరసన!

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి తక్షణమే చర్యలు చేపట్టాలని అమెరికాలో భారతీయ హిందువులు నిరసన వ్యక్తం చేశారు.హ్యూస్టన్‌ షుగర్‌ల్యాండ్‌ సిటీ హాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భారతీయ,బంగ్లాదేశ్ హిందువులు పాల్గొన్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులను ఆపాలని, దక్షిణాసియాలో శాంతిభద్రతలు కాపాడాలని వారు పట్టుబట్టారు. ఈ నిరసనలో 300 మంది భారతీయులు, బంగ్లాదేశ్ మూలాలకు చెందిన హిందువులు నిరసనలో పాల్గొన్నారు.

గత వారం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విద్యార్థుల నిరసనల కారణంగా రాజీనామా చేసి భారతదేశంలో ఆశ్రయం పొందారు.బంగ్లాదేశ్ లో తలెత్తిన అల్లర్లులో  290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని అల్లరి మూకలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.దీంతో పలు దేశాలలోని హిందువులు బంగ్లా దాడులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వారికి రూ.20 లక్షల లోన్!

Advertisment
తాజా కథనాలు