USA: అమెరికాకు సౌదీ అరేబియా షాక్..50 ఏళ్ళ పెట్రో డాలర్ ఒప్పందానికి గుడ్‌ బై?

అమెరికాకు సౌదీ అరేబియా షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు. 50 ఏళ్ళ పెట్రో-డాలర్ ఒప్పందానికి సౌదీ అరేబియా గుడ్‌ బై చెప్పనుందని తెలుస్తోంది. దాంతో పాటూ ఆయిల్ అమ్మకాలపై చైనాతో కూడా చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి.

New Update
USA: అమెరికాకు సౌదీ అరేబియా షాక్..50 ఏళ్ళ పెట్రో డాలర్ ఒప్పందానికి గుడ్‌ బై?

50 petrodollor agreement: సౌదీ అరేబియా నిర్ణయం ఇంటర్నేషనల్ మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. యాభై ఏళ్ళ నుంచి ఉన్న పెట్రో-డాలర్ ఒప్పందానికి స్వస్తి పలుకుతూ సౌదీ అమెరికాకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. మరోవైపు ఇదే ఒప్పందాన్ని చైనాతో ఖరారు చేసుకునేందుకు చర్చలు జరుపుతోందని కూడా అంటున్నారు. ఇదే కనుక జరిగితే అంతర్జాతీయ చమురు మార్కెట్లో విపరీతమైన కుదుపులు సంభవిస్తాయి. దీనివలన ఇప్పటివరకు ఉన్న డాలర్ ఆధిపత్యం పడిపోయే ప్రమాదం కూడా ఉంది. దాంతో పాటూ చైనా కరెన్సీ అయిన యువాన్ విలువ అమాంతం పెరిగిపోతుంది. జూన్ 9 ఆదివారంతో గడువు ముగిసిన యునైటెడ్ స్టేట్స్‌తో 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందాన్ని పొడిగించకూడదని సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే ఈ వార్తను అటు అమెరికా కానీ, ఇటు సౌదీ అరేబియా కానీ నిర్ధారించలేదు. మరికొన్ని చోట్ల ఇది ఫేక్ న్యూస్ అని కూడా వస్తోంది. దీని మీద మరింత స్పష్టత రావాలంటే కొంత వేచి చూడాల్సిందే.

అసలేమిటీ పెట్రో -డాలర్ ఒప్పందం?

అంతర్జాతీయ మార్కెట్లో చమురు సంక్షోభం వచ్చినప్పుడు పుట్టిందీ పెట్రో-డాలర్ ఒప్పందం. సౌదీ అరేబియా తన చమురు ఎగుమతులపై యూఎస్ డాలర్లలో మాత్రమే ధరను నిర్ణయిస్తుంది. దాంతో పాటూ యూఎస్ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేయడానికి చమురు అమ్మకాల నుండి అదనపు డబ్బును ఉపయోగిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ దీనికి బదులుగా సౌదీకి సైనిక మద్దతు, రక్షణను ఇప్పటివరకు అందించింది. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా తన ఆర్థిక, జాతీయ భద్రతను ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తోంది. మరోవైపు అమెరికా కూడా చమురు అమ్మకాలు, దాని రుణానికి క్యాప్టివ్ మార్కెట్‌ను పొందింది.

సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలానే కారణాలున్నాయని తెలుస్తోంది. సౌదీకి అండగా, రక్షణగా ఉంటామని అమెరికా భద్రతా వాగ్దానాలు చేసింది కానీ వాటి మీద అరేబియా అసంతృప్తిగా ఉంది. దాంతో పాటూ ప్రస్తుతం మార్కెట్లో చైనా వాల్యూ చాలా పెరుగుతోంది. ప్రపంచ నంబర్ వన్‌గా చైనా పెరుగుతోంది. ఇది కూడా సౌదీ అరేబియా అటు వైపు వెళ్ళడానికి కారణంగా మారింది. చైనాతో చమురు ఒప్పందం గురించి ఆరేళ్ళుగా చర్చలు చేస్తోంది సౌదీ. ఈ ఏడాది అవి మరింత ఎక్కువ అయ్యాయని...ఇప్పుడు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు.

ఒప్పందం మారితే ఏం జరుగుతుంది?

ఈ ఒప్పందం కనుక మారితే భౌగోళిక, ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య పరంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ధరల విధానాలు, ట్రేడింగ్ పద్ధతులలో మార్పులను కూడా వ‌స్తాయి. దీంతో ప్రపంచ చమురు ధరలను, వ్యాపార విధానాలను ప్రభావితం అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది గ్లోబల్ ఆయిల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త ఆర్థిక సాధనాలు-సర్దుబాట్లను తీసుకువ‌స్తుంది.

Also Read:Pawan Kalyan: ఈనెల 20 తర్వాత అందరినీ కలుస్తా..జనసేనాని

Advertisment
తాజా కథనాలు