డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....!

చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.

author-image
By G Ramu
డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....!
New Update

చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య సమావేశం జరగాలని చైనానే ప్రతిపాదన చేసిందని పేర్కొంది. అది ప్రస్తుతం పెండింగ్ లో వుందని వెల్లడించింది. బ్రిక్స్ సమావేశాల్లో జిన్ పింగ్ తో కాసేపు ప్రధాని మోడీ మాట్లాడినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే సరిహద్దుల వద్ద శాంతి నెలకొల్పేయాల ప్రయత్నించాలని, సమస్యలు పరిష్కరం అయితేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని జిన్ పింగ్ కు ప్రధాని మోడీ సూచించినట్టు పేర్కొన్నాయి.

ఇది ఇలావుంటే భారత్ విషయంలో చైనా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని మరోసారి తేటతెల్లం అయింది. ఓ వైపు సైనిక బలగాల ఉపసంహరణ అంటూనే సరిహద్దుల వెంట తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా యూఎస్ కు చెందిన మ్యాక్సర్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా మిలటరీ నిర్మాణాలను వేగవంతం చేసినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

వాస్తవాధీన రేఖకు 65 కిలో మీటర్ల దూరంలో చైనా సైనిక నిర్మాణాలను చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. సుమారు 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిఘా రాడార్లు, రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ నిర్మాణాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో మంచు కురియడం మొదలైన సమయంలో ఈ నిర్మాణాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పీఎల్ఏ, వైఎల్సీ-4, వైఎల్సీ-8 సర్వేలైన్స్ రాడార్లు ఈ శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. ఈ ప్రదేశంలో చైనీస్ మిలిటరీ వ్యూహాత్మక వినియోగానికి అవకాశం కలిగించే భూగర్బ మార్గాలు వున్నట్టు కనిపిస్తున్నాయి.

#modi #china #india #lac #border #constructions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe