Telangana: ఫలించిన నిరీక్షణ.. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరితో చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో యంగ్‌ బ్యాటర్‌ సర్పరాజ్‌ చెలరేగిపోయాడు. మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరితో చెలరేగి ఇంగ్లాండ్‌ జట్టుకు చెమటలు పట్టించాడు. మొదటి మ్యాచ్‌లోనే వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Telangana: ఫలించిన నిరీక్షణ.. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరితో చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌
New Update

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. టీమిండియా యంగ్ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తన సత్తా చూపించాడు. మొదటి మ్యాచ్‌లోనే ఏకంగా హాఫ్‌ సెంచరీ చేసి చెలరేగిపోయాడు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి.. ఇంగ్లండ్‌ బౌలర్లకు చెమటలు పట్టించేశాడు. ఈ క్రమంలోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో మొదటి మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ చరిత్ర సృష్టించాడు.

33 పరుగులకే 3 వికేేట్లు

ఇక వివరాల్లోకి వెళ్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 33 పరుగులకే 3 వీకెట్లు పడిపోయాయి. వరుస ఓవర్లలో యశస్వీ జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ను ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఔట్‌ చేశాడు. అయితే గత మ్యాచ్‌లో శుభమన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం డకౌట్‌ అయ్యాడు. దీంతో ఆ సమయంలో రంగంలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా స్కోర్‌ను పెంచారు. తొలి సెషన్‌లో వీళ్లు ఇంకో వికెట్‌ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే క్రీజులో కుదురుకున్న రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

Also Read: హిట్ మ్యాన్ బ్యాక్ టూ ఫామ్..మూడో టెస్ట్‌లో సెంచరీ

రోహిత్‌, జడేజాలు సెంచరీ

దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోగా.. 93 పరుగులు చేసింది. ఇక రెండో సెషన్‌లో రోహిత్‌ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరితో రెచ్చిపోయారు. టెస్టులో రోహిత్‌కు ఇది 11వ సెంచరీ. వీళ్లిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. రెండో సెషన్‌లో మాత్రం ఇంగ్లండ్‌కు ఒక్క వికెట్‌ కూడా పడగట్టలేకపోయింది. ఇక మూడో సెషన్‌లో రోహిత్‌, జడేజాల పార్ట్నర్‌షిప్ 200 దాటింది. ఇలా స్కోర్‌ పెరుగుతున్న తరుణంలో హిట్‌మ్యాన్‌ను మార్కు వుడ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లైంది. 196 బంతుల్లో రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు.

సత్తా చూపించిన సర్ఫరాజ్‌

మొత్తానికి 237 పరుగులకు టీమిండియా నాలుగో వికెట్లు పడిపోయాయి. ఈ సమయంలోని క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌. తన వన్డే స్టైల్‌లో చెలరేగిపోయాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు చేశాడు. అయితే 82వ ఓవర్లలో సర్ఫరాజ్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో 314 పరుగులకు టీమిండియా సగం వికెట్లు పోగొట్టుకుంది. ఇక సర్ఫరాజ్‌ ఖాన్ 66 బంతుల్లో .. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు చేశాడు. అయితే సర్ఫరాజ్‌ తన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోవడంతో.. అతనిపై అటు క్రికెటర్లు, ఇటు క్రికెట్‌ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Also Read: రంజీలు ఆడితేనే ఐపీఎల్.. తిక్క కుదిర్చిన బీసీసీఐ!

#ind-vs-eng-test-match #cricket-news #sarfaraz-khan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe