సంక్రాంతికి ఊరెళ్లడానికి ఇంకా టికెట్ దొరకలేదా..మరేం కంగారు పడాల్సిన పనిలేదు..ఎందుకంటేవ సౌత్ సెంట్రల్ రైల్వే మరి కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమయ్యింది. హైదారాబాద్ నుంచి ఏపీలోని పలు ఊర్లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
తిరుపతి, సికింద్రాబాద్, నర్సాపూర్, కాకినాడ, లింగంపల్లికి స్పెషల్ ట్రైన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సంక్రాంతికి ఊర్లు వెళ్లే వారి కోసం 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రెండు రోజుల క్రితమే రైల్వే అధికారులు ప్రకటించగా తాజాగా మరో పది రైళ్లను నడపనున్నట్లు అధికారులు వివరించారు.
దీనికి సంబంధించిన స్పెషల్ ట్రైన్ల వివరాలను రైల్వే శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచింది. ట్రైన్ నంబర్ 07605 రైలు తిరుపతి నుంచి అకోలా కు జనవరి 5 నుంచి జనవరి 26 వరకు నడవనుంది. ఇది శుక్రవారం పూట అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నంబర్ 07606 రైలు అకోలా నుంచి తిరుపతికి ఆదివారం పూట నడవనుంది.
జనవరి 7నుంచి జనవరి 28 వరకు ఈ రైలు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07609 రైలు పూర్ణా నుంచి తిరుపతికి జనవరి 1 నుంచి జనవరి 29 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు అధికారులు వివరించారు. 07610 రైలు తిరుపతి నుంచి పూర్ణాకు ప్రతి మంగళవారం జనవరి 2 నుంచి జనవరి 30 వరకు నడపనున్నట్లు అధికారులు వివరించారు.
07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కి జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. నర్సాపూర్ టు హైదరాబాద్ జనవరి 7 నుంచి జనవరి 28 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు నడవనుంది. తిరుపతి టు సికింద్రాబాద్ జనవరి 7 నుంచి జనవరి 28 వరకు ప్రత్యేక రైలు నడవనుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి జనవరి 8 నుంచి జనవరి 29 వ తేదీ వరకు ప్రతి సోమవారం ఓ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి కి ప్రతి సోమవారం, బుధవారం , శుక్రవారం జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఈ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ కి ప్రతి మంగళవారం, గురువారం, శనివారం జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
Also read: ‘ఉరి వేసుకోవాలా?’ రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్ భూషణ్!