/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-13T150359.192-jpg.webp)
Sanjana Ganesan on Body Shaming: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) భార్య సంజనా గణేశన్ (Sanjana Ganesan) బాడీ షేమింగ్ ట్రోలింగ్ పై తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. కొంతకాలంగా ఆమె శరీరాకృతిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ (Trolls) నడుస్తున్న విషయం తెలసిందే. ఈ వల్గర్ కామెంట్స్ పై రీసెంట్ గా స్పందించిన ఆమె.. ట్రోలర్స్ కు చురకలంటించింది. చదువు, జ్ఞానం లేని వారు ఇలాంటి అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్నారంటూ మండిపడింది.
Happiness is here ❤️ pic.twitter.com/PV8yeu5xEZ
— Jasprit Bumrah (@Jaspritbumrah93) February 9, 2024
బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోట్..
ఈ మేరకు లవర్స్ డే (Valentine's Day) సందర్భంగా సంజన ఇన్‌స్టా వేదికగా ఓ ప్రమోషన్ వీడియో అభిమానులతో పంచుకుంది. అయితే ఇందులో ఓ కంపెనీకి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ దంపతులిద్దరూ నటించారు. వైట్ అండ్ వైట్ లుక్ లో బ్యూటీఫుల్ గా కనిపించారు. అయితే ఈ ఫొటో, వీడియోలపై ఇరువురి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. చూడముచ్చటగా ఉన్నారంటూ పొగిడేశారు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను అందంగా లేదని, ఈ మధ్య చాలా లావు అయిందంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.‘మీరు చాలా లావుగా ఉన్నారు’ అంటూ ఓ నెటిజన్ డైరెక్ట్ గా చెప్పేశారు.
happy 🦓
.
.#T20WorldCup pic.twitter.com/w25ZIwluUv— Sanjana Ganesan (@SanjanaGanesan) October 18, 2022
ఇది కూడా చదవండి : Millets Payasam: మిలెట్స్ పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా?.. 15 నిమిషాల్లో చేసేయండి
మీకెంత ధైర్యం?
అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంజనా.. ‘మీరు చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న విషయాలు గుర్తులేవా? ఒక మహిళ బాడీపై నెగెటీవ్ కామెంట్స్ చేయడానికి మీకెంత ధైర్యం? ఇక్కడినుంచి వెళ్లిపో!’ అంటూ తనను ఆన్ ఫాలో చేసేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇష్యూ చర్చనీయాంశమవగా బుమ్రా దంపతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తుంది. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ట్రోలర్స్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇదిలావుంటే.. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్‌గా భారీ పాపులారిటీ పొందిన సంజనా గణేశన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉంది. 2021లో బుమ్రాను పెళ్లి చేసుకోగా గతేడాది ఈ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి విరామం దొరకడంతో బుమ్రా తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుండగా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను చిత్తు చేసేందుకు సిద్ధమయ్యాడు.