Sangareddy Ex MLA Jaggareddy: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి ప్రజలను ఇకపై ఓట్లు అడగను అని అన్నారు. 6 నెలల ముందే తాను ఓడిపోతున్నట్లు తెలుసు అని పేరొన్నారు. 99 పనుల్లో ఒక్క పని చేయకపోతే.. ఆ ఒక్క పనినే అందరు అడుగుతున్నారని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తా అని వెల్లడించారు. పదేళ్ళలో ఎవరు చేయని అభివృద్ధి తాను చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నకూడా అభివృద్ధి కోసం ప్రయత్నం చేశానని.. మెడికల్ కాలేజ్ కూడా తెచ్చినట్లు ఆయన అన్నారు.
ALSO READ: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ మూడు రూట్లలో మెట్రో విస్తరణ.. వివరాలివే!
రిజల్ట్ గురుంచి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ముందే చెప్పానని అన్నారు. నేను ఓడిపోతున్న రేవంత్ అని డిసెంబర్ 2న ఆయనతో మాట్లాడాను.. లేదన్న నువ్వుగెలుస్తున్నావు అని రేవంతే అన్నాడని తెలిపారు. ప్రజలు నన్ను గెలిపించలేదు కాబట్టి సంగారెడ్డి అభివృద్ధి గురుంచి తాను సీఎం రేవంత్ ను అడగలేను అని మీడియా చిట్ చాట్ లో అన్నారు. అన్ని నియోజకవర్గాల లాగానే సంగారెడ్డిలో 6గ్యారంటీలు (Congress Six Guarantees) అమలు అవుతాయని స్పష్టం చేశారు. తాను గెలవాలని అనుకుంటే అక్కడే ఉండి గెలిచేవాన్ని అని అన్నారు. కానీ ఓట్లు అడగడానికి మాత్రమే పనిచేసే నాయకుణ్ణి కాదు నేను అని ఎమోషనల్ అయ్యారు. జిల్లాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే గెలిచేవాళ్ళము అని కేటీఆర్ మాట్లాడింది కరెక్టు కాదు అని అన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంగారెడ్డితో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. అయితే, జగ్గారెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారానికి ఆయనకే చెక్ పెట్టారు. తదుపరి పార్టీని కార్యక్రమాల్లో జగ్గారెడ్డి పాల్గొంటారా? లేదా? అనేది వేచి చూడాలి.
ALSO READ: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్?