Party Symbols: బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్‌

బీఆర్ఎస్‌ కారు గుర్తును పోలిన సింబల్స్‌ ఆ పార్టీని వెంటాడుతున్నాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు కారు లాగే ఉండడంతో బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను రోడ్‌ రోలర్‌, రోటి మేకర్‌లు దెబ్బ తీశాయి.

New Update
Party Symbols: బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్‌

Symbols Worrying BRS in Parliament Elections: బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. అయితే దీన్ని పోలిన గుర్తులు తర్వాత చాలా వచ్చాయి. రోడ్ రోలర్ (Road Roller), రోటీ మేకర్, ఆటో (Auto) ఇలాంటివి. ఇవి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. ఇవి చూడ్డానికి కార్ లాగే ఉండడంతో గత ఎన్నికల్లో కొంతమంది బీఆర్ఎస్ కు వేస్తున్నామనుకుని ఇతర పార్టీలకు ఓటు వేసేశారు. దీనివల్ల బీఆర్ఎస్ ఓట్లను కోల్పోయింది. క్రితంసారి అసంబ్లీ ఎన్నికల టైమ్‌లోనూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఇదే సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ టెన్షన్ మొదలైంది.

రోడ్ రోలర్, రోటీ మేకర్..

బీఆర్ఎస్‌ పార్టీ గుర్తు కారును పోలి ఉండే రోడ్‌ రోలర్‌, రోటి మేకర్ గుర్తులు ఇప్పుడు దాన్ని టెన్షన్ పెడుతున్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో యుగతులసి పార్టీ అభ్యర్థి గుర్తు రోడ్ రోలర్. బీఆర్ఎస్‌ అభ్యర్థి పద్మారావు తర్వాతి స్థానంలోనే యుగతులసి పార్టీ అభ్యర్థి గుర్తు ఉంటుంది. రోడ్‌ రోలర్‌ సింబల్‌ కారు గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. గతంలో దీని గురించి బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఎన్నికల ముందు వెళ్ళడంతో కోర్టు ఈ పిటిషన్లను కొట్టేసింది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారంటూ చివాట్లు కూడా పెట్టింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో యుగతులసి పార్టీ అభ్యర్థి పోటీ చేయకుండా కేసీఆర్ పావులు కదిపారు. అవి పలించి అప్పుడు ఆ పార్టీ అసలు పోటీలోనే ఉండకుండా విత్‌డ్రా అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులుకనిపించడం లేదు.

రోడ్ రోలర్ గుర్తు కూడా బీఆర్ఎస్‌ను ఆందోళన పరుస్తోంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి రోడ్‌ రోలర్ గుర్తును కేటాయించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత సాయన్న ఉన్నారు. కారు, రోడ్ రోలర్ గుర్తులకు ఓటర్లు కానీ కన్ఫ్యూజన్ అయితే నివేదిత ఓట్లన్నీ రోడ్‌ రోలర్‌కు పడే అవకాశం ఉంది. మరోవైపు రోటీ మేకర్ గుర్తు కూడా ఇంచుమించుగా కారులానే కనిపిస్తుంది. దీని విషయంలో కూడా ఓటర్లు తికమక పడే ఛాన్స్ ఉంది.

ప్రతీసారీ ఇదే తలనొప్పి...

ప్రతీసారి బీఆర్ఎస్‌కు ఈ గుర్తులు పెద్దగా తలనొప్పిగా మారుతున్నాయి. ఇంతకు ముందు అంటే బీఆర్ఎస్‌ను ఎవరూ ఓడించే పరిస్థితులు లేవు కాబట్టి కొంత నష్టం వాటిల్లినా ఏం కాలేదు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ప్రతీ ఓట్ కౌంట్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు గుర్తుల కన్ఫ్యూజన్ వల్ల ఓట్లను కోల్పోతే అది ఆ పార్టీకి చాలా పెద్ద నష్టమే అవుతుంది.

Also Read:Encounters: దండకారణ్యంలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు

Advertisment
తాజా కథనాలు