Samantha : షారుఖ్ ఖాన్ సరసన సమంత.. క్రేజీ కాంబో సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!

స్టార్ హీరోయిన్ సమంత షారుక్‌ఖాన్‌ సరసన నటించనుందట. డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన యాక్షన్‌ అడ్వంచరస్‌ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.

New Update
Samantha : షారుఖ్ ఖాన్ సరసన సమంత.. క్రేజీ కాంబో సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!

Samantha Pair With Shah Rukh Khan : టాలీవుడ్ లో గత ఏడాది 'ఖుషి' మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే సామ్ తన సొంత నిర్మాణ సంస్థలో 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తోంది. అటు రీసెంట్ గానే ఓ మాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న సినిమాలో సామ్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక తాజాగా బాలీవుడ్ లో ఓ భారీ అఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.

షారుఖ్ సరసన...

లేటెస్ట్ బాలీవుడ్ టాక్ ప్రకారం.. సమంత బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్‌ సరసన నటించనుందట. స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన యాక్షన్‌ అడ్వంచరస్‌ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. సమంత 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న సామ్.. ఇప్పుడు షారుఖ్ సినిమాతో హీరోయిన్ గా రీ లాంచ్ అవుతుండటం విశేషం.

Also Read : ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాగా షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో గత ఏడాది వచ్చిన 'డంకి' మూవీ కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి వీర్ కాంబోలో సినిమా రాబోతుందనే న్యూస్ బయటకి రావడంతో అప్పుడే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మొదలైపోయాయి. మరి ఈసారైనా ఈ కాంబినేషన్ కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకుంటుదేమో చూడాలి.

Advertisment
తాజా కథనాలు