Samantha : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. సినిమాల్లోకి రీ ఎంట్రీ, కొత్త సినిమా పోస్టర్ అదుర్స్

సమంత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

New Update
Samantha : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. సినిమాల్లోకి రీ ఎంట్రీ, కొత్త సినిమా పోస్టర్ అదుర్స్

Samantha New Movie Poster Released : టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నేడు (ఆదివారం) తన పుట్టిన రోజు(Birthday) జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలెబ్రిటీలు, అభిమానులు ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతుంటే.. సమంత మాత్రం మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

publive-image

సమంత కొత్త సినిమా టైటిల్ ఇదే

విజయ్ దేవరకొండతో 'ఖుషి' తర్వాత సినిమాలకి కొద్ది నెలల పాటూ గ్యాప్ ఇచ్చిన సామ్.. ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ మేరకు కొత్త సినిమా పోస్టర్ ని సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేసింది. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ లో సమంత చీరకట్టులో భుజానికి బ్యాగ్, చేతిలో గన్ పట్టుకొని ముఖంపై రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఇందులో సమంత లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది.

publive-image

చూస్తుంటే ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా(Women Oriented Movie) లాగా అనిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాని సమంత తన సొంత ప్రొడక్షన్ హౌజ్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాలో సమంత కొత్తగా పెళ్ళైన యువతీ 'బంగారం' అనే పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సమంత కొత్త సినిమా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు కానీ త్వరలోనే సినిమా స్టార్ట్ కానుందని తెలిపారు.

Also Read : కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ‘జబర్దస్త్’ కమెడియన్.. ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisment
తాజా కథనాలు