Samantha : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్!

సమంత మలయాళంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు తాజా సమాచారం. ఫస్ట్ మూవీనే మమ్ముట్టి లాంటి స్టార్ తో సమంతకు ఛాన్స్ రావడం విశేషం.

New Update
Samantha : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్!

Samantha Mollywood Entry With Mammootty : టాలీవుడ్ (Tollywood) లో గత ఏడాది 'ఖుషి' మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత (Samantha) ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే సామ్ తన సొంత నిర్మాణ సంస్థలో 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తోంది. అటు రీసెంట్ గానే ఓ బాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుంది.

ఇక ఇప్పుడు మలయాళంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సమంతను ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసిన కోలీవుడ్ (Kollywood) డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరోసారి సమంతను మాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. అక్కడ తొలి సినిమానే స్టార్ హీరో సరసన కనిపించనుందట.

Also Read : ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్.. ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా!

మమ్ముట్టి తో మాలీవుడ్ ఎంట్రీ...

తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తొలిసారిగా మలయాళంలో సినిమా చేయబోతున్నాడు. ఇందులో మమ్ముట్టి కథానాయకుడిగా నటించి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఇందులో నయనతార (Nayanthara) నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ ఏమైందో తెలీదు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సమంతను వరించింది. సమంతకు కూడా మలయాళంలో ఇదే తొలి చిత్రం అవ్వడం విశేషం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ నెల 15వ తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

#tollywood #samantha #mammootty
Advertisment
తాజా కథనాలు