Samantha : అఖిల్‌ పై సమంత పోస్ట్‌.. ఆనందంలో అభిమానులు!

అఖిల్‌ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్‌ మీడియా వేదిక గా స్పెషల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్‌ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది.

New Update
Samantha : అఖిల్‌ పై సమంత పోస్ట్‌.. ఆనందంలో అభిమానులు!

Samantha-Akkineni Akhil : టాలీవుడ్‌(Tollywood) టాప్‌ హీరోయిన్‌ సమంత(Samantha)... అక్కినేని వారసుడు నాగ చైతన్య(Naga Chaitanya) ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ, పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. పెళ్లైన కొద్ది కాలానికే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ విడిగా ఉంటూ ఎవరి జీవితం వారు చూసుకుంటున్నారు.

కానీ సోషల్‌ మీడియా(Social Media) లో మాత్రం వీరి గురించి నిత్యం ఏదోక వార్త వస్తూనే వినిపిస్తూనే ఉంటుంది. కానీ వాటిని ఏమి పట్టించుకోకుండా... అటు సామ్‌ కానీ ఇటు చైతూ కానీ వారి కెరీర్ మీదనే ఫోకస్ పెట్టారు. అయితే వారి మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ చైతూ తమ్ముడు అఖిల్‌తో మాత్రం సమంత ఇప్పటికీ క్లోజ్‌గానే ఉంటుంది.

ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు నాడు కచ్చితంగా విషెస్‌ పోస్ట్ షేర్ చేస్తుంది. ఈ ఏడాది కూడా సామ్, అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిసింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్(Akkineni Akhil) వండర్‌ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది. అంతే కాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది.

ఇందులో అఖిల్ క్యూట్‌గా ఉండటంతో.. అది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్నతో విబేధాలు ఉన్నప్పటికీ.. అఖిల్‌కు విష్ చేయడం గ్రేట్ అంటూ చెప్పుకుంటున్నారు.

Also read: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి… ఇది పదకొండవది!

#heroine-samantha #social-media #akkineni-akhil #birthday-wishes
Advertisment
తాజా కథనాలు