Movies: హార్ట్ బ్రేక్ అయిందంటూ సమంత పోస్ట్..దాని గురించి మాత్రం కాదు

హార్ట్ బ్రేక్ అయింది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు.. ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..అంటూ సమంత పోస్ట్ పెట్టింది. ఇది కచ్చితంగా నాగచైతన్య ఎంగేజ్మెంట్ గురించే అనుకుంటున్నారు కదూ..అంత లేదు..ఎవరి గురించో మీరే చూసేయండి.

New Update
Samantha : సమంత మలయాళ ఎంట్రీ.. స్టార్ హీరో సరసన ఛాన్స్!

Sam Insta Post Gone Viral: సమంత ఇన్‌స్టా, ట్విట్టర్ పోస్ట్‌లు భలే వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ లేదా సెన్సేషనల్ ఫోటోలతో పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది సమంత ఈరోజు కూడా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. పోరాడే వ్యక్తులు చాలా కష్టతరమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. అయితే వారు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టంది శామ్. ఈరోజు నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్ మెంట్ అయింది. చై‌‌‌‌–శామ్ విడిపోయారు కాబట్టి దీని గురించే రాసింది అనుకున్నారు అంతా. కానీ అసలు విషయం ఏంటంటే...సమంత రాసింది వినేశ్ ఫోగాట్ గురించి.

వినేశ్ ఫోగాట్‌కు సెలబ్రిటీలు అందరూ అండగా నిలుస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ కూడా పోస్ట్‌లు పెడుతున్నారు. మహేష్ బాబు వినేశ్‌కు మద్దతుగా పోస్ట్ట పెట్టాడు. అలాగే సమంత కూడా ఆమెకు అండగా నిలుస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. మీరు ఒంటరి వారుకాదు..పోరాడే వారు ఎప్పుడూ అడ్డంకులను ఎదుర్కొంటారు. మరింత శక్తితో తిరిగొస్తారు. మీ అద్భుతమైన సామర్థ్యంతో ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇలా నిలదొక్కుకోవడం నిజంగా మెచ్చుకోదగినది అంటూ సమంత వినేశ్ గురించి రాసింది. అంతే కాదు ఆమె రిటైర్మెంట్ ప్రకటించిందని తెలిసి హార్ట్ బ్రేక్ అయిందని కూడా చెప్పింది. దానికి గుర్తుగా హార్ట్ బ్రేక్ సింబల్‌ కూడా పెట్టింది.

publive-image

అయితే సమంత సమయం చూసుకుని పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. పెట్టింది వినేశ్ గురించే అయినా అందులో తన గురించి కూడా చెప్పుకుందని పోలుస్తున్నారు. పరోక్షంగా చై‌‌–శోభిత ఎంగ్మేజ్మెంట్‌ గురించే అంటోందని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:Paris Olympics: అందమే శాపం అయింది..కెరీర్‌‌కు గుడ్‌బై చెప్పిన పరాగ్వే స్విమ్మర్

#vinesh-phogat #samantha #insta-post #chi-sobhita
Advertisment
తాజా కథనాలు