SAM-CHAI:సమంత-చై ఏం చేసినా హాట్ న్యూసే...వైరల్ అవుతున్న సామ్ టాటూ రిమూవింగ్

SAM-CHAI:సమంత-చై ఏం చేసినా హాట్ న్యూసే...వైరల్ అవుతున్న సామ్ టాటూ రిమూవింగ్
New Update

సమంత-నాగ చైతన్య...మోస్ట్ క్రేజీ జంట. వాళ్ళ ప్రేమ, పెళ్ళి...విడాకులు అన్నీటి గురించీ హాట్ న్యూస్ లే. అన్నింటికన్నా విడాకులు తీసుకున్న దగ్గర నుంచీ అయితే సోషల్ మీడియాలో జనాలు అస్సలు వాళ్ళను విడిచిపెట్టడం లేదు. ఏం చేసినా అదిగో అలా చేశారు...ఇదిగో ఇలా చేసారు అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలామందికి చై-సామ్ విడిపోవడం ిష్టం లేదు. అందుకే వాళ్ళను కలిపేయడానికి ప్రతీ చిన్న కారణాన్ని వెతుకుతూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే జరిగింది. సమంత పెంపుడు కుక్క హష్..చైతన్య దగ్గర ఉండడం కనిపించింది. అంతే వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతున్నారు. అందుకే సమంత పెట్ డాగ్ చై దగ్గర ఉంది అంటూ తెగ గుసగుసలాడేసుకున్నారు. దానికి సామ్ కానీ, చై కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ సమంత పెట్టిన తన లేటెస్ట్ పిక్స్ తో వాటిన్నంటికీ ఆన్సర్ చెప్పినట్టు అయింది.

సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసిటిస్ చికిత్స, మనశ్శాంతి కోసం విదేశాలు వెళ్ళింది. అక్కడి ప్రదేశాలను తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫొటోలనూ సోషల్​ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా కూడా కొన్ని పిక్స్​ ను షేర్ చేసింది. అందులో ఆమె పింక్ కలర్ శారీలో ఫోటో షూట్ చేసింది. అయితే ఈ ఫొటోలో సమంత అందాలతో పాటు నెటిజెన్స్ మరొకటి కూడా గమనించారు. అదేంటంటే.. సమంత పక్కటెముకుల మీద ఉండాల్సిన చైతూ పేరు టాటూ ఇప్పుడు కనిపించడం లేదు.

చైతూ ఆనవాళ్ళు తన ఒంటి మీద లేకుండా చెరిపేసుకుంది. ప్రస్తుతం చై టాటూను సామ్ తొలగించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజెన్స్ ఆ టాటూ ఏమైందని తెగ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య పేరుని సమంత పూర్తిగా తొలిగించిందా..? లేదా సినిమాల్లో కవర్ చేసినట్లు ఈ ఫోటోషూట్​లో కూడా కవర్ చేసిందా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు అంతా వాళ్ళు కలిసిపోయారని చెప్పుకున్నవాళ్ళు ఇప్పుడు కలిసే సమస్య లేదని అంటున్నారు. ఏంటో వాళ్ళిద్దరూ తమ జీవితాలు తాము జీవిస్తూ వాళ్ళ బాధలేవో పడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం తమకు నచ్చినట్టు తాము మాట్లాడేసుకుంటూ బోలెడు కాలక్షేపాన్ని సృష్టించేసుకుంటున్నారు.

Also Read:జీవం ఉన్న పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది…సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

#samantha #marriage #movies #divorse #chaitanya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe