Salt Water Bath : మనలో చాలా మంది శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి వారానికి ఒకసారి తలస్నానం(Head Bath) చేస్తుంటారు. కొందరు రోజూ తల స్నానం కూడా చేస్తారు. తలస్నానానికి బోర్‌వెల్ నీరు, బావి నీరు, నది నీరు లేదా మున్సిపల్ నీటిని ఉపయోగిస్తాం. జుట్టు ఒక్కసారిగా రాలిపోతే(Hair Fall) వాడే నీళ్లలో ఉప్పు(Salt Water) ఎక్కువగా ఉంటుందన్న అనుమానం కలుగుతుంది. ఉప్పు నీళ్లలో స్నానం చేయడం వల్ల తలపై ఉప్పు పేరుకుపోయి జుట్టు రాలిపోతుందని కొందరు అంటున్నారు. మనిషికి సగటున 100 వెంట్రుకలు రాలడం సహజం అని వైద్యులు చెబుతున్నారు. మగవారిలో బట్టతల అనేది హార్మోన్ల లోపం. కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. పోషకాహార లోపం, వృద్ధాప్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
ఉప్పునీటితో తల స్నానం చేస్తే..?
తలపై కొంత మొత్తంలో హెయిర్ రూట్ ఉంటుంది. ఉప్పునీరు మూలాల్లోకి చొచ్చుకొనిపోయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బోర్‌వెల్ నీటిని హార్డ్ వాటర్ అని, నది నీటిని రెయిన్ వాటర్, సాఫ్ట్ వాటర్ అని అంటారు. నది నీటిలో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్ తక్కువగా ఉంటుంది. బోర్‌వెల్ నీటిలో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. బోర్‌వెల్ నీళ్లను వెంట్రుకలకు పట్టిస్తే ఉప్పు మూలాల్లో స్థిరపడి వెంట్రుకల మృదుత్వం పోయి వెంట్రుకలు రాలిపోతాయని కొందరి వాదన.
పరిశోధనలో ఏం తేలింది..?
దీనికి సంబంధించి ఒక పరిశోధన జరిగింది. ఈ అధ్యయనంలో 20 మంది మహిళలు(Women's) పాల్గొన్నారు. నెల రోజులుగా పది మంది బోర్‌వెల్ నీరు, మరో పది మంది నది నీటిలో స్నానాలు చేశారు. ఆ తర్వాత 20 మంది వెంట్రుకల బలాన్ని పరీక్షించారు. ఎలాంటి మార్పు లేకుండా అందరి జుట్టు బలం ఒకేలా ఉంది. అందుకే జుట్టు రాలడానికి ఉప్పు నీటికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుందని, వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : పడకగదిలో ఈ మార్పులు చేయండి.. ఇక ఆనందమే ఆనందం!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.