Salt Benefits: కేవలం వంటలేకే కాదు..ఉప్పుతో చాలా ఉపయోగాలు

ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఉప్పు, సర్ఫును స్టౌ పెట్టే బల్లపై చల్లి కాసేపు తర్వాత నీళ్లతో కడిగేస్తే వాసనతో పాటు మురికి కూడా వదులుతుంది. ఇంట్లో ఎక్కువగా చీమలు తిరిగే మార్గంలో ఉప్పును వేస్తే మళ్లీ చీమలు రాకుండా ఉంటాయి.

New Update
Salt Benefits: కేవలం వంటలేకే కాదు..ఉప్పుతో చాలా ఉపయోగాలు

Salt Benefits: ఉప్పులేని కూరను అస్సలు ఊహించలేం. ఉప్పు వల్ల మనకు అయోడిన్‌ లభిస్తుంది. కేవలం ఉప్పును కూరల్లోనే కాకుండా ఇతర పనులకు వాడుకోవచ్చు. ఉప్పుతో పాత్రలు కడిగితే మెరుస్తాయి. చీమలు రాకుండా ఉప్పు చల్లవచ్చు. వేడినీళ్లలో ఉప్పువేసి కాళ్లు ఉంచితే నొప్పులు తగ్గిపోతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పు.. ప్రతి వంటలో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉప్పులేని కూర చప్పగా ఉంటుంది. ఉప్పు ఉంటేనే ఆ కూరలకు రుచి. అయితే కేవలం ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: బార్లీ గింజలు చేసే మేలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

మనం వంట గదిలో స్టౌ పెట్టే బల్ల చాలా మురికిగా మారుతూ ఉంటుంది. ఉప్పు, సర్ఫును ఆ బల్లపై చల్లి కాసేపు ఉంచిన తర్వాత నీళ్లతో కడిగేస్తే వాసనతో పాటు మురికి కూడా వదులుతుంది. ఇంట్లో చీమలు బాగా ఇబ్బందులు పెడుతుంటే ఎక్కువగా చీమలు తిరిగే మార్గంలో ఉప్పును వేస్తే మళ్లీ చీమలు రాకుండా ఉంటాయి. ఫ్రై వంటకాలు చేసినప్పుడు ఆ పాత్రలు జిడ్డుగా మరియు నల్లగా మాడిపోతుంటాయి. అలాంటి సమయంలో ఉప్పు వేసి తోమితే మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తాయి. వెల్లుల్లిపాయ పొట్టు తీసిన తర్వాత మన చేతులు చాలా మంటగా అనిపిస్తాయి. అంతేకాకుండా వాసన కూడా వస్తూ ఉంటుంది.

కాళ్ల నొప్పులు పోవాలంటే..

ఉప్పు, నిమ్మరసం కలిపి చేతులను శుభ్రపరచుకుంటే మంటతో పాటు చేతి వాసన కూడా తగ్గిపోతుంది. అలాగే దుస్తులపై ఏదైనా తుప్పు మరకలు ఉంటే ఉప్పుతో కడగడం వల్ల పోతాయి. అలాగే ఓవెన్‌లో ఉప్పు వేసి కాసేపటి తరువాత తుడిస్తే శుభ్రం అవుతుంది. అరికాళ్లు నొప్పులుగా ఉంటే ఒక బకెట్లో పాదాలు మునిగేంత వరకు నీళ్లు పోసి అందులో ఉప్పు, బేకింగ్‌ సోడా వేసుకుని కలిపి ఆ తర్వాత కాళ్లను అందులో పెట్టి పావుగంట సేపు ఉంచితే నొప్పులు పోతాయి. టీ, కాఫీలను వాడే ప్లాస్కులు ఎంత శుభ్రం చేసినా వాసన వస్తూ ఉంటాయి. అందులో ఉప్పు వేసి వేడి నీళ్లు పోయాలి. ఆ తర్వాత మూత పెట్టి బాగా ఊపాలి. ఆ తర్వాత మామూలు నీళ్లతో కడిగితే వాసన పోతుంది.

Advertisment
తాజా కథనాలు