Salaar Movie: సలార్లో పృథ్వీరాజ్ లుక్..వామ్మో భయంకరంగా ఉన్నాడుగా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్‌తో, హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో నటిస్తున్న మలయాళం నటుడు పృథ్వీరాజ్ బర్త్ డే ఈరోజు. ఈసందర్భంగా నలార్ లో ఆయన లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్.

New Update
Salaar Movie: సలార్లో పృథ్వీరాజ్ లుక్..వామ్మో భయంకరంగా ఉన్నాడుగా

Salaar Movie Prithviraj Look : సలార్ మీద అంచనాలు చాలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ (KGF) రెండు పార్ట్‌లూ దుమ్ము రేగ్గొట్టాయి. ఇప్పడు అదే దర్శకుడు ప్రభాస్ (Prabhas) తో మూవీ తీస్తుండండతో హైప్ మరింత పెరిగిపోయింది. దానికి తోడు టీజర్ లో ప్రభాస్ కు ఇచ్చిన ఎలివేషన్ తో అంచనాలు పీక్స్ కు వెళ్ళిపోయాయి. డిసెంబర్ 22న విడుదల అవుతున్న సలార్ మూవీ (Salaar Movie) ట్రైలర్‌ను ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో పృథ్వీరాజ్ లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్.

Also Read:బందీలను వెంటనే విడిచిపెట్టేయండి-హమాస్‌కు ఐరాస విజ్ఞప్తి

సలార్‌లో పృథ్వీ లుక్‌ని రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది మూవీ టీమ్. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పోస్టర్ లుక్ లో పృథ్వీరాజ్ చాలా సీరియస్ నోట్ లో ముక్కుకి రింగుతో బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. దీన్ని బట్టి సలార్ కేస్ ఫైర్ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే సలార్ పార్ట్ 2లో జగపతి బాబు పాత్ర కీలకంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. సలార్ లో శృతి హాసన్ (Shruthi Hassan) హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ఇదే కావడం సలార్ పై ఎక్స్ పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు హిట్‌లు ఏవీ రాలేదు. దాంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ సలార్ మీద ఆశలు పెట్టుకున్నారు.

Also Read: శివాజీ మా డాడీ.. మిస్ యు డాడీ.. కనీళ్ళు పెట్టించిన నయనీ ఎలిమినేషన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు