Andhra Pradesh: ముందు అది తెలుసుకోండి.. సీఎం కేసీఆర్‌కు సజ్జల మాస్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన సెటైర్లపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.

New Update
Sajjala: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..!

Sajjala Ramakrishna Reddy: డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ-సింగిల్ రోడ్డు వస్తే ఏపీ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna) తీవ్రంగా స్పందించారు. ఏపీలో పాలనపై కామెంట్స్ చేసే ముందు.. తెలంగాణ(Telangana)లో ఎలా ఉందో ఆలోచించుకోవాలని అన్నారు. ఏపీలో పాలన బాగుంది కాబట్టే.. తెలంగాణ పరిధిలో ఉన్న పోలవరం ముంపు గ్రామాల ప్రజలు ఏపీలో కలిసిపోతామని అంటున్నారని పేర్కొన్నారు. వీరంతా ఏపీకి వస్తామని ఎందుకు అంటున్నారో.. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రహించాల్సిన అవసరం ఉందంటూ చురకలంటించారు.

గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. 'పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా ఏపీ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల ప్రజలు ఏపీలోకి వస్తాం అంటున్నారు. ఈ మండలాల్లో ప్రజలు ఎందుకు వస్తామంటున్నారో కేసీఆర్ గ్రహించాలి. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ఏపీలోకి వస్తున్నామని 7 మండలాల ప్రజలు చెబుతున్నారు.' అని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ దాడులు.. ఇది వారి పనే అంటున్న కాంగ్రెస్ నేతలు..

ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుందని పేర్కొన్నారు సజ్జల. ఏపీలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారనేది తెలుసుకుని.. తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలంటూ గతంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు సజ్జల. ఏపీలో పాఠశాలలు తెలంగాణలో పాఠశాలను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు.

చంద్రబాబుపై విమర్శలు..

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. అనారోగ్యం బాగాలేదని చంద్రబాబు నాయుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చన్న సజ్జల.. చంద్రబాబుకు మాత్రం 14 గంటల సమయం పట్టిందని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎవరైనా 14 గంటలు కారులో కూర్చుంటారా? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

చంద్రబాబు నాయుడికి అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మ రథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉందన్నారు సజ్జల. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ జామ్ ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉందని విమర్శించారు. హైదరాబాదులో చంద్రబాబుని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమే అని సెటైర్లు వేశారు సజ్జల.

ఏపీ సర్కార్‌పై కేసీఆర్ సెటైర్లు..

సత్తుపల్లిలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ-సింగిల్ రోడ్డు వస్తే ఏపీ అంటూ సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి:ప్రభాకర్ రెడ్డిని పొడిచింది అందుకే.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో రఘునందన్ షాకింగ్ నిజాలు..!!

Advertisment
తాజా కథనాలు