Sajjala : చంద్రబాబును సీఎం చేయాలనే.. షర్మిలకు సజ్జల కౌంటర్

జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. చంద్రబాబును సీఎం చేసేందుకు షర్మిల ఆలోచిస్తుందని అన్నారు. చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే అని అన్నారు. వైఎస్‌ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారని అన్నారు.

Sajjala: సజ్జలకు బిగ్ షాక్.. సీఐడీకి ఫిర్యాదు!
New Update

Sajjala Ramakrishna Reddy : ఏపీసీసీ(APCC) చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల(YS Sharmila).. సీఎం జగన్(CM Jagan) పై చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పై షర్మిల వాడిన బాషా సరికాదని అన్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్(Congress) ఎంత వేధించిందో అందరికి తెలుసు అని అన్నారు. షర్మిల మాట్లాడిన భాషా, చేసిన హడావుడి చూశాక జాలి కలుగుతుందని అన్నారు.

వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) ఆశయాలకు కట్టుబడి సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు సజ్జల. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా సీఎం జగన్ కు ప్రజలు అక్కున చేర్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్‌ కుటుంబానికి అన్యాయం చేసిందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ అక్రమ కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వైఎస్‌ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని గుర్తు చేశారు.

Also Read : ఖుష్భు అత్తతో పీఎం మోదీ భేటీ..కల నిజమైందని సంతోషం..!!

వైఎస్సార్‌పై కేసులు..

వైఎస్సార్‌పై సైతం కాంగ్రెస్‌ కేసులు పెట్టిందని అన్నారు సజ్జల(Sajjala). వైఎస్‌ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. షర్మిల నిన్నటి వరకు తెలంగాణ(Telangana) లో ఏం చేశారు? అని ప్రశ్నించారు. షర్మిల.. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకొచ్చారు? అని అన్నారు. రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. షర్మిల వాడిన భాష బాగోలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల యాస భాష మారిందని.. ఆమె మాటలకు ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదని సజ్జల అన్నారు.

చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే..

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు సజ్జల. ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు(Chandrababu) తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉందని అన్నారు. చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే అని అన్నారు. చంద్రబాబు ప్రతీరోజూ చేసే విమర్శలే ఇప్పుడు షర్మిల చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్‌ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారని అన్నారు.

Also Read : Janasena : టార్గెట్ జగన్.. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

#sharmila-shocking-comments-on-jagan #chandrababu #ap-latest-news #sajjala-ramakrishna-reddy #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe