Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హయాంలో వివేకా హత్య.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకా కూతురు సునితా రెడ్డి.. వైసీపీ ఓటు వేయొద్దు అంటు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపిందని.. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగిందన్నారు.

New Update
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో పవన్‌కు డేంజర్.. సజ్జల హాట్ కామెంట్స్

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పై వైఎస్ వివేకా కూతురు సునీత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. సునీత ఈరోజు ముసుగు తీసేసిందని అన్నారు. చంద్రబాబు చేతిలో పావులా ఆమె ఉన్నారని చురకలు అంటించారు.' సునీత ఎవరి ప్రతినిధి అనేది ఈరోజు తెలిసిపోయింది. వివేకానంద ఎమ్మెల్సీ గా ఓడిపోవడానికి కారణం ఎవరు?. వైసీపీ పార్టీకి పూర్తి మెజార్టీ ఆరోజు ఉంది. జగన్ తల్లి విజయమ్మని ఓడించాలనుకున్న వివేకాను దగ్గర చేర్చుకున్నారు. వివేకాను ఓడించిన టీడీపీతో సునీత చేతులు కలిపింది. వివేకాను ఓడించింది బీటెక్ రవి కదా.

Also Read: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?

తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా ?

మరి అదే చంద్రబాబు, బీటెక్ రవితో.. సునీత ఎలా జట్టు కట్టారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే కదా. 4, 5 రోజుల్లో తెలిపోవాల్సిన కేసు. మరి చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదు. చంద్రబాబును సునీత అడగాలి కదా. ఇది రాజకీయ కుట్ర తో జరుగుతోంది. వైసీపీ అభ్యర్థులు గుండాలు, స్మగ్లర్లు అయితే మా నుండి వెళ్లిన వాళ్ళని ఎందుకు చంద్రబాబు తీసుకుంటున్నాడు. సునీత కుటుంబ సభ్యుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. విచారణ అన్నింటిపైన జరుగుతాయి. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా?.

పవన్ మోసం అర్థమైపోయింది

24 సీట్లను పవన్ 240 సీట్లు అనుకుంటున్నట్టున్నాడు. పోటీకి అభ్యర్థులు లేని పవన్ కళ్యాణ్ ఏం తొక్కుతాడు. పదేళ్ల కిందట పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు. తాడేపల్లి గూడెం సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. తొలి సమావేశంతోనే టీడీపీ-జనసేన పొత్తు ఫెయిల్ అని తేలిపోయింది. పవన్ అందరిని మోసం చేశాడని కాపు నాయకులకే అర్థమైపోయింది' అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

Also Read:  వైసీపీ 9వ జాబితా విడుదల!

Advertisment
తాజా కథనాలు