Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.. సజ్జల హాట్ కామెంట్స్

ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయోగం వికటించిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

New Update
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.. సజ్జల హాట్ కామెంట్స్

Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణారెడ్డి. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పరాకాష్టకు చేరిందని సెటైర్లు వేశారు. ఆయన మాటలు చూస్తే ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి (TDP-Janasena-BJP Alliance) ప్రయోగం వికటించిందని పేర్కొన్నారు. కూటమి వునికే ప్రశ్నార్థకం అయ్యిందమీ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ పరాభవం చెందుతుందనో జోస్యం చెప్పారు.

ALSO READ: సీబీఐ విచారణ.. కవితకు కొత్త టెన్షన్!

ఈ ఎన్నికల తరువాత టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగు అవుతుందని అన్నారు. చంద్రబాబు పిల్ల చేష్టలు చేస్తున్నారని చురకులు అంటించారు. 2019లో చంద్రబాబు అధికారంలో ఉండి కూడా అధికారుల ను దబాయించారని ఆరోపించారు. చంద్రబాబు కు వ్యవస్థల పై ఉండే గౌరవం ఇదని తెలిపారు. వృద్ధుల పెన్షన్ ల విషయంలో చంద్రబాబు దుర్మార్గం గా వ్యవహరించారని అన్నారు సజ్జల.

పెన్షన్ అందుకునే క్రమంలో కొంతమంది వృద్దులు దురదృష్టవశాత్తూ చనిపోయారని పేర్కొన్నారు. దానిమీద చంద్రబాబు ఈసీకి లేఖలు రాసి యాగీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెన్షన్ లు ఇళ్ళ దగ్గరకు చేరకుండా లెటర్ పెట్టించింది చంద్రబాబు అని ఆరోపించారు. పురంధరేశ్వరి అజెండా అంతా చంద్రబాబు ది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరిని మార్చాలని లేఖ రాశారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ కి వెన్నుపోటు లో కూడా చంద్రబాబు కి పురంధరేశ్వరి సహకారం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు దగ్గరకు రాగానే చంద్రబాబు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని అంటున్నారని.. చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఉచిత ఇసుక ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పై మేము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని అన్నారు. వివేకా హత్య ఎన్నికల అజెండా కావాలి అని షర్మిల కోరుకుంటే కొద్దీ రోజుల్లో తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల పేడ్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారారని షర్మిలపై చురకలు అంటించారు. చంద్రబాబు అజెండా షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు