Sajjala Ramakrishna Reddy: మాకు టార్గెట్ క్లియర్‌గా ఉంది.. చంద్రబాబు సజ్జల స్వీట్ వార్నింగ్!

రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమకు టార్గెట్ క్లియర్‌గా ఉందన్నారు సజ్జల. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్‌పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నాడని చురకలు అంటించారు.

New Update
Sajjala Ramakrishna Reddy: మాకు టార్గెట్ క్లియర్‌గా ఉంది.. చంద్రబాబు సజ్జల స్వీట్ వార్నింగ్!

Sajjala Ramakrishna Reddy: మైనారిటీలను పట్టించుకోవడం లేదని వైసీపీ పార్టీ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. వైఎస్సార్‌సీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారని అన్నారు. అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. సునామిలాగా వస్తున్న ఆదరణని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్‌లను నొక్కించాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ALSO READ: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

టార్గెట్ క్లియర్‌గా ఉంది..

రాబోయే 50 రోజుల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొని రావడమే తమ పని అని అన్నారు. తమ పార్టీకి టార్గెట్ క్లియర్‌గా ఉందని వ్యాఖ్యానించారు. పరీక్షలు వచ్చినపుడు ఎలా పనిచేస్తామో.. అలానే ఇప్పుడు పని చేయాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిన్నపాటి విచక్షణ కూడా లేకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

చంద్రబాబు అరాచకాన్ని..

2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చేశామని అన్నారు సజ్జల. అందుకే ప్రజలు మనకు పట్టం అధికారాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ఇక పై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తామని భరోసా ఇచ్చారు. మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

అన్ని వర్గాలకు..

సీఎం జగన్ బేధాలు లేకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. తమ పార్టీ ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రం గా ఏపీ ని జగన్ తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చిందని అన్నారు. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నాడని చురకలు అంటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు