Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 80 శాతం ప్రజలకు చేరిందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమికి అజెండా లేదని అన్నారు. అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు.. మంచి చేసిన మేము ఒక వైపు.. నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని విమర్శించారు. 2014 -19 అరాచక ప్రభుత్వం కావాలా?.. 2019-24 మధ్య ఉన్న ప్రజా ప్రభుత్వం కావాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు.
ALSO READ: కేసీఆర్ అంటేనే అంతం… రఘునందన్ రావు విమర్శలు
పవన్ కళ్యాణ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని చురకలు అంటించారు సజ్జల. ఆలోచన లేని అవగాహన లేని రాజకీయ నాయకుడని... పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు...పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి వచ్చాడు.. చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ కదులుతాడు...ఆగుతాడు అని ఫైర్ అయ్యారు. చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుందని అన్నారు.
చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పడం తమకు మంచిదని అన్నారు. చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని.. ఏపి రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఉన్నారని.. తోడేళ్ళు గుంట నక్కలు,ముళ్లపందులు అన్ని ఏకమై అటువైపు ఉన్నాయని విమర్శించారు. సీఎం జగన్ 25వ తేదిన నామినేషన్ వేస్తారని అన్నారు. రెండు రోజుల్లో మ్యానిఫెస్టో విడుదల చేస్తాం అని చెప్పారు.