Sajjala Comments on Chandrababu : ఏం చేయలేమని తెలిసిందే కాబట్టే..ఇలాంటి చర్యలు!

కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అంగళ్లులో తన పై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Sajjala Comments on Chandrababu : ఏం చేయలేమని తెలిసిందే కాబట్టే..ఇలాంటి చర్యలు!
New Update

Sajjala Comments on Chandrababu Naidu: కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అంగళ్లులో తన పై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు పర్యటించాలనుకున్నప్పుడు రోజు జరిగిన సంఘటనల వీడియో క్లిప్పులను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. అసలు పుంగనూరు కానీ, అంగళ్లులో కానీ గొడవలు జరగడానికి ముఖ్య కారణం చంద్రబాబు, ఆయన అనుచరుల ముఠానే అని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని తగలబెట్టాలని చంద్రబాబు పుంగనూరును వేదికగా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్క పుంగనూరు మాత్రమే కాదు...అనేక చోట్లు ఆయన అల్లర్లకు ప్రణాళికలు రూపొందించారని వివరించారు.

పుంగనూరులో జరుగుతున్న సంఘటనల సమయంలో చంద్రబాబులోని వికృత రూపం బయటపడిందని ఆయన విమర్శించారు. టీడీపీ శ్రేణులు ఉన్మాదంతో ప్రవర్తించారు. వాళ్లకై వాళ్లే ఉన్మాదంతో రెచ్చిపోయారే తప్ప వారి పై దాడి చేసింది ఎవరూ కాదు. వారిలో వారే తన్నుకు చచ్చారు. నాయకుడు అంటే గొడవ పడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ చంద్రబాబు అలా కాదు తన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టాడు. "కుట్ర కోణం లేకుండా ఇలాంటి ఘటనలు జరుగుతాయా? అని ప్రశ్నించారు.

ఇలా చేయడం సిగ్గుచేటు..!

14 ఏళ్లు సీఎంగా ఉన్న ఓ ఉన్మాది శిక్షణలో తయారైన ఉన్మాదులు వీళ్లంతా. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడూ ఉన్నారు. పోలీసులంటే చంద్రబాబుకు చులకన భావం ఉంది. ఇలాంటి అల్లర్లు చంద్రబాబుకు కొత్త కాదు. విద్యార్థి దశ నుంచే ఉన్నాయి... ఆ విషయం మాకు తెలుసు. గొడవలు జరగాలి... శాంతిభద్రతల సమస్య తలెత్తాలి... దాన్నుంచి ఏదైనా లబ్ది పొందాలి... చిన్నప్పటి నుంచి చంద్రబాబు పంథా ఇదే. ఎన్ని ప్రాణాలు పోయినా సరే తన ప్రయోజనాలే తనకు ముఖ్యం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు.

స్వయనా తోడల్లుడే చెప్పాడు!

చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడే అప్పట్లో ప్రజలందరికీ తెలియజేశారు. ఏదో ధర్నా జరిగితే ఏముంటుంది..కనీసం నాలుగైదు బస్సులైనా తగలబడితేనే కదా ఏదైనా ప్రభావం కొట్టొచ్చినట్లు కనపడేది అని చంద్రబాబు అనేవారని తెలియజేసినట్లు సజ్జల తెలిపారు. అసలు ఇప్పుడు చంద్రబాబుకి ప్రాజెక్టుల సందర్శన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్నారా? లేక అక్కడ ప్రజలను రెచ్చగొట్టేందుకు వెళ్తున్నారా? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏం చేయాలేమని అర్ధమైంది..కాబట్టే!

రాష్ట్రంలో శాంతిభద్రతలు భగ్నమైతే రాష్ట్రమంతా అల్లర్లు జరగాలి అనే దిక్కుమాలిన కుట్రకు పాల్పడ్డారు. పోలీసులు సంయమనం పాటించడంతో టీడీపీ ప్రణాళిక నెరవేరలేదు. ఎస్పీ చాలా శాంతంగా వ్యవహరించాడు. పోలీసులే వెనక్కి తగ్గిన విషయం వీడియోలో స్పష్టంగా కనబడుతుంది.

ప్రజాక్షేత్రంలో ఏంచేయలేమన్న విషయం చంద్రబాబుకు అర్థమైంది... అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు.

మరో పక్క ఆయన కొడుకు..!

ఇంకో పక్క ఆయన కొడుకు... ఆయన రూట్లో ఆయన తిరుగుతున్నారు. వీళ్లలో ఒక్కరైనా రెచ్చగొట్టే రకంగా కాకుండా, బూతులు మాట్లాడకుండా ఉండలేరు. చంద్రబాబు ప్లాన్ మేరకు కుట్రకు పాల్పడినవాళ్లు దొరికారు. చంద్రబాబు సహా క్షేత్రస్థాయి నాయకులందరూ పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే" అని సజ్జల పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా అంగళ్లులో దాడి ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ చంద్రబాబు సహా మరో 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారు. తనను హత్య చేసేందుకు వైసీపీ గూండాలు అంగళ్లు వచ్చారని ఆరోపించారు. కమాండోల వల్ల తన ప్రాణాలు దక్కాయని, పలుమార్లు తనను కాపాడారన్నారు. ఇదంతా కూడా సీఎం జగన్‌ ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read: అమలాపురంలో ఫ్లెక్సీల వార్.. వైసీపీ ఆగ్రహం

#andhrapradesh #chandrababu #tdp #chandrababu-naidu #ycp #ysrcp #sajjala-ramakrishna-reddy #sajjala-comments-on-chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe