SAINDHAV Pre Release Event : సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వులు పూయించిన వెంకి మామ

విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతోన్నసందర్భంగా ఈ చిత్ర  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై విక్టరీ వెంకటేష్ నవ్వులు పూయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వెంకి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ వేదికపై వెంకి స్పీచ్ అదిరిపోయింది.

New Update
SAINDHAV Pre Release Event : సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వులు పూయించిన వెంకి మామ

SAINDHAV Pre Release Event : విక్టరీ వెంకటేష్ కేరేర్లో 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ మూవీ  సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ వేదికపై వెంకీ మామ హుషారు చూసి ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు.  స్టేజ్ మీద నుంచే తన అభిమానులతో వరసలు కలిపి పిలుస్తూ అభివాదాల చేశాడు.. అక్కా చెల్లే అమ్మ నాన్న తమ్ముడు అన్నా, వదిన ,తాతయ్య అంటూ అందరిని పిలుస్తూ తన సినిమాను చూడాలని కోరాడు.

ALSO READ:Guntur kaaram trailer:రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్

లడికి లడికి పాట ఏంట్రా.. ఆ టైం అయిపోయింది

ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను వైజాగ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పేటప్పుడు వెనకాలే వచ్చి వెంకి నిల్చొని ఓ లుక్ ఇవ్వడం చాలా ఫన్ గా ఉంది. శైలేష్ కొలను వేదికపై అందరి పేర్లు చెప్పి రామజోగయ్య శాస్త్రి పేరు మరచిపోవడంతో శాస్త్రి వచ్చి  తాను హర్ట్ అయ్యానంటూ వెంకికి కంప్లైంట్ ఇవ్వడం .. శైలేష్ కొలనును  పాట పాడమని పనిష్మెంట్ వేయడం . . ఏం పాట పాడిద్దామని వెంకీ మామ అనుకుంటూ ఉండగా.. ఫ్యాన్స్ లోంచి లడికి లడికి పాట అంటూ అరవటంతో . లడికి లడికి పాట ఏంట్రా.. ఆ టైం అయిపోయింది అంటూ వెంకీ మామ సెటైర్లు వేసి..  సైంధవ్‌ మూవీ నుంచి ఓ సెంటిమెంట్  పాటను శైలేష్ కొలను తో వేదికపై పాడించటం ప్రేక్షకులను హుషారెక్కించిoది.ఈ ఈవెంట్ లో వెంకి తన స్టైల్ మ్యానరిజమ్స్ , డ్యాన్సులతో అలరించారు.వేడుకలో జెర్సీ ఫేం శ్రీనాథ్ ,విలన్ గా నటించిన నవాజుద్దీన్ సిద్ధికి పాల్గొన్నారు. ఈ మూవీలో విలన్ పాత్ర క్షణక్షణం సినిమాలో విలన్ పాత్రను తలపిస్తుందని శైలేష్ కొలను తెలిపారు.

వేదికపై సైంధవ్‌లోని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పిన వెంకి

ఇక.. ఈ ఈవంట్ లో  సైంధవ్‌లోని పవర్ ఫుల్ డైలాగ్స్ ను వెంకి చెప్తూ ఉంటె ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసారు. మొత్తానికి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా విశాఖ సాగర తీరాన జరిగిన సైంధవ్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ జనాదరణ పొందుతూ ఉండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మొన్న జరిగిన వెంకి 75 వేడుక హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెల్సిందే. చూడాలి మరి.. ఈ సంక్రాంతి బరిలో ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో.

ALSO READ:Naa saami ranga behind scenes : నా సామిరంగా కథ పట్టుకుని దర్శకుల వేటలో నాగార్జున

Advertisment
తాజా కథనాలు