Saindhav OTT Release: శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన చిత్రం సైంధవ్. ఇటీవలే సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రీచ్ అవ్వలేకపోయిన సైంధవ్ .. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తాజాగా సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
సైంధవ్ ఓటీటీ రిలీజ్
వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) దక్కించుకుంది. ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం భాషలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. సైంధవ్ సాటిలైట్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్ రిలీజైన 20 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలవడంతోనే ఇంత త్వరగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి
సైంధవ్ స్టోరీ
తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో వెంకటేష్ సైకో అనే గ్యాంగ్ స్టార్, కూతురిని ప్రాణంగా ప్రేమించే తండ్రిగా రెండు షేడ్స్ లో కనిపించారు. కార్టెల్ అనే మాఫియా గ్యాంగ్ లో పని చేస్తున్న వెంకటేష్ భార్య చనిపోవడంతో.. కూతురిని చూసుకోవడానికి అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇంతలో తన కూతురికి అరుదైన నరాల వ్యాధి ఉందని.. అది నయం చేయడానికి 17 కోట్ల ఇంజెక్షన్ కావాలని డాక్టర్లు చెప్తారు. కూతురు ప్రాణాలు కాపాడడానికి సైకో అయిన వెంకటేష్ అన్ని కోట్ల ఇంజెక్షన్ ఎలా సంపాందించాడు.. కార్టెల్ మాఫియా గ్యాంగ్ తో ఎలా పోరాడాడు అనేది సైంధవ్ (Saindhav) స్టోరీ.
Also Read: Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్